‘ఆర్ఆర్ఆర్’ తర్వాత మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ #RC15. క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ మూవీ లేటెస్ట్ షెడ్యూల్ న్యూజిలాండ్ లో జరగనుంది. న్యూజిలాండ్ లోని డ్యూన్‌డిన్‌తో బీచ్, ఒటాగో హార్బర్ తో పాటు సముద్ర తీర ప్రాంతాల్లో చరణ్, కీయరాలపై ఒక రొమాంటిక్ డ్యూయెట్‌ను ఈ షెడ్యూల్ లో ప్లాన్ చేశారు. ఇప్పటికే చిత్ర యూనిట్ న్యూజిలాండ్ చేరుకోని, షూటింగ్ సన్నాహాల్లో ఉంది. శంకర్ సినిమాల్లో పాటలకి ఒక స్పెషల్ క్రేజ్ ఉంటుంది. ఎగ్జాటిక్ లోకేషన్స్ లో సాంగ్ ని షూట్ చేసి, ఆడియన్స్ ని విజువల్ బ్యూటీ ఇవ్వడంలో శంకర్ దిట్ట. ఇప్పుడు RC15 విషయంలో ఇదే ఫాలో అవుతున్నాడు. బ్యూటీఫుల్ లోకేషన్స్ లో ప్లాన్ చేసిన ఈ సాంగ్ కి స్టార్ కొరియోగ్రాఫర్, నేషనల్ అవార్డ్ విన్నర్ బాస్కో మార్టిస్ డ్యాన్స్ కంపోజ్ చేస్తోన్నాడు. గతంలో రామ్‌చరణ్ హీరోగా నటించిన ధృవ సినిమాలోని ‘నీతోనే డాన్స్ టునైట్’ పాటకు బాస్కో మార్టిస్ కంపోజ్ చేసిన స్టెప్స్ అందరినీ ఆకట్టుకున్నాయి.
ఈ పాట కోసం చరణ్ రకరకాల హెయిర్ స్టైల్స్ ట్రై చేస్తున్నాడు. ఈ విషయాన్ని చరణ్ స్టైలిష్ట్ ‘ఆకిమ్ హలీం’ తన సోషల్ మీడియాలో షేర్ చేశాడు. చరణ్ తో ఉన్న ఫోటోలని పోస్ట్ చేసిన ఆకిమ్, న్యూజిలాండ్ షెడ్యూల్ కోసం కొత్త లుక్స్ ట్రై చేస్తున్నాం. ఈ పాటలో చరణ్ లుక్స్ మైండ్ బ్లో చేసేలా ఉంటాయని కోట్ చేశాడు. ఆకిమ్ పోస్ట్ చేసిన ఫోటోలు ట్విట్టర్ లో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ సాంగ్ తర్వాత రెండు వారాల పాటు గ్యాప్ ఇచ్చి డిసెంబర్ లాస్ట్ వీక్ లో RC15 నెక్స్ట్ షెడ్యూల్‌ను ఏపీలోనే ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే చరణ్ కాలేజ్ ఎపిసోడ్స్ కొన్ని వైజాగ్ లో షూట్ చేశారు.