Kalyan Ram Skips Question on Naveen Medaram: నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా డెవిల్ అనే సినిమా తెరకెక్కింది. అభిషేక్ ఆర్ట్స్ బ్యానర్ మీద ఈ సినిమాని అభిషేక్ నామా నిర్మాతగా తొలుత ప్రకటించారు. ఆ సమయంలో నవీన్ మేడారం దర్శకుడిగా ఈ సినిమా తెరకెక్కుతుందని వెల్లడించారు. అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ కొద్ది రోజుల క్రితం ఈ సినిమాకి దర్శక నిర్మాత అభిషేక్ నామా అని పబ్లిసిటీ చేయడం మొదలు పెట్టడంతో నవీన్ మేడారం కావాలనే సినిమా నుంచి తప్పించినట్లు ప్రచారం జరిగింది. అయితే ఆ తర్వాత నవీన్ మేడారం కూడా తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా సినిమా నుంచి తనను తప్పించడం పట్ల ఆవేదన వ్యక్తం చేసినట్లు కనిపించాడు.
Sriya Reddy: ఎంత చెప్పినా ప్రశాంత్ నీల్ వినలేదు.. సలార్ రాధారమ పాత్రపై శ్రీయరెడ్డి షాకింగ్ కామెంట్స్
అయితే ఆ తర్వాత ఈ విషయం పూర్తిగా చల్లారిపోయింది. సినిమా రిలీజ్ కి దగ్గర పడుతున్న నేపథ్యంలో తాజాగా కళ్యాణ్ రామ్ మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా కళ్యాణ్ రామ్ కి నవీన్ మేడారం గురించి ప్రశ్న ఎదురైంది. అయితే నవీన్ మేడారం గురించి తాను మాట్లాడటం కరెక్ట్ కాదని దానికి కరెక్ట్ సమాధానం అభిషేక్ నామా మాత్రమే ఇవ్వగలరని ఆయన చెప్పుకొచ్చారు. తనకు ముందుగా కథ నేరేట్ చేసింది శ్రీకాంత్ విస్సా అని అభిషేక్ నామా చెప్పడంతోనే తాను సినిమా ఒప్పుకున్నారని కళ్యాణ్ రామ్ చెప్పుకొచ్చాడు. ఇక ఈ విషయంలో తాను మాట్లాడేది ఏమీ లేదని ఎందుకంటే దీనికి అభిషేక్ నామా మాత్రమే కరెక్ట్ సమాధానం చెప్పగలడు అని కళ్యాణ్ రామ్ చెప్పుకొచ్చాడు. సంయుక్త మీనన్ హీరోయిన్ గా మాళవిక నాయర్ కీలక పాత్రలో నటించిన ఈ సినిమా డిసెంబర్ 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. 1942వ సంవత్సరంలో జరిగిన పీరియాడిక్ కథగా చెబుతున్న ఈ సినిమా మీద ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుంచి అంచనాలు పెరుగుతున్నాయి.