kaliyugam Pattanamlo Trailer Released: నాని మూవీ వర్క్స్, రామా క్రియేషన్స్ ఆధ్వర్యంలో విశ్వ కార్తికేయ, ఆయూషి పటేల్ హీరోహీరోయిన్లుగా నటించిన ‘కలియుగం పట్టణంలో’ డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కింది. ఈ మూవీకి కథ, డైలాగ్స్ ,స్క్రీన్ ప్లే, అందిస్తూ రమాకాంత్ రెడ్డి డైరెక్ట్ చేయగా డాక్టర్ కందుల చంద్ర ఓబుల్ రెడ్డి, జి.మహేశ్వరరెడ్డి, కాటం రమేష్‌లు నిర్మించారు. ఈ సినిమా మార్చి 29న ప్రేక్షకుల ముందుకు రానుండగా సోమవారం నాడు ట్రైలర్‌ను ఘనంగా లాంచ్ చేశారు. ఇక ‘వీడు ఉండాల్సింది ఇక్కడ కాదు.. మెంటల్ హాస్పిటల్‌లో’ అంటూ సాగే ఈ ట్రైలర్‌లో యాక్షన్, లవ్, క్రైమ్, థ్రిల్లర్ ఇలా అన్ని అంశాలను చూపించారు. నంద్యాలలో జరిగే హత్యల చుట్టూ ఈ కథ తిరుగుతుందని ట్రైలర్ చూస్తే అర్థం అవుతోంది.
Manchu Lakshmi: స్టేజ్ పైన మంచు లక్ష్మీ కాళ్లు మొక్కిన అభిమాని.. వీడియో వైరల్..
నల్లమల ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్‌లో ఏదో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌ను అల్లుకుని కథను రాసినట్టుగా ట్రయిలర్ హింట్ ఇస్తోంది. ‘ఏ యుగంలో అయినా తల్లిని చంపే రాక్షసుడు పుట్టలేదమ్మా’ అని హీరో చెప్పే ఎమోషనల్ డైలాగ్ ఇంట్రెస్ట్ పెంచుతోంది. అన్ని రకాల ఎమోషన్స్‌తో అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా ఈ ట్రైలర్ ఉందని చెప్పక తప్పదు. ఇక ట్రయిలర్ లాంచ్ లో హీరో విశ్వ కార్తికేయ మాట్లాడుతూ.. ‘కలియుగం పట్టణంలో ప్రతీ పాత్రకు ఎంతో ప్రాధాన్యం ఉంటుందని, ఈ సినిమాలో అన్ని జానర్లను ప్రేక్షకులు ఎక్స్‌పీరియెన్స్ చేయబోతున్నారని అన్నారు. ఇది కచ్చితంగా ఓ యూనిక్ పాయింట్, ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని అన్నారు. ఆయుషి పటేల్ మాట్లాడుతూ.. ‘మా టీం అంతా కలిసి సినిమా షూటింగ్ ఎంతో సరదాగా చేశాం, కడపలో ఎంతో కంఫర్టబుల్‌గా షూట్ చేశాం, మా హీరో విశ్వ కార్తికేయ ఎంతో సపోర్ట్‌గా నిలిచారని అన్నారు.