ఓటీటీలో ఈ మధ్య సస్పెన్స్ మూవీలు ఎక్కువగా వస్తున్నాయి.. ఇప్పటివరకు వచ్చిన సినిమాలు అన్ని మంచి రెస్పాన్స్ ను అందుకున్నాయి.. ఇప్పుడు మరో సస్పెన్స్ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది.. విశ్వ కార్తికేయ, ఆయుషి పటేల్, చిత్రా శుక్లా హీరో, హీరోయిన్లుగా నటించిన మూవీ కలియుగం పట్టణం.. ఈ సినిమా తాజాగా ఓటీటీలోకి వచ్చేసింది..
ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది.. క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ఈ చిన్న సినిమాను ఎలాంటి అనౌన్స్మెంట్ లేకుండానే సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసింది.. ఈ సినిమాకు రమాకాంత్ రెడ్డి దర్శకత్వం వహించాడు. కలియుగం పట్టణంలో మూవీలో విశ్వకార్తికేయ హీరోగా, విలన్‌గా నటించాడు.. కథ కొంచెం డిఫరెంట్ గా ఉండటంతో మంచి టాక్ ను అందుకుంది..
పిల్లల విషయంలో తల్లి దండ్రులు చేసే పొరపాట్లు పిల్లల జీవితాలను నాశనం చేస్తాయని ఈ సినిమాలో చూపించారు. ఫ్యామిలీ ఎమోషన్స్, యాక్షన్ అంశాలను జోడించి దర్శకుడు ఈ మూవీని తెరకెక్కించాడు.ఈ సినిమాలో చిత్రాశుక్లా పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించింది.. మార్చి 29 న విడుదలైన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో కి వచ్చేసింది.. అక్కడ పర్వాలేదని టాక్ ను సొంతం చేసుకుంది.. మరి ఇక్కడ ఎలాంటి టాక్ ను అందుకుంటుందో చూడాలి..