సూపర్ స్టార్ మహేష్ బాబు “సర్కారు వారి పాట” నిర్మాతలు తమన్ సంగీతం అందించిన క్లాసిక్ మెలోడీ “కళావతి”తో మ్యూజిక్ ప్రమోషన్లను ప్రారంభించారు. ప్రోమోకు అద్భుతమైన స్పందన లభించినప్పటికీ, లిరికల్ వీడియో సాంగ్ అందమైన కూర్పు, మనోహరమైన గానం, అర్థవంతమైన సాహిత్యం కారణంగా అంచనాలను మించి దూసుకెళ్తోంది. అనంత శ్రీరామ్ సాహిత్యంతో సిద్ శ్రీరామ్ స్వరం, మహేష్, కీర్తి ఫ్రెష్ లుక్ “కళావతి” మంచి కళను తీసుకొచ్చాయి. ఈ సాంగ్ 24 గంటల వ్యవధిలో అత్యధిక వ్యూస్ సాధించి రికార్డు క్రియేట్ చేసింది. టాలీవుడ్ లో అత్యంత వేగంగా 50 మిలియన్ వ్యూస్ ను సాధించిన ఫస్ట్ సింగిల్ గా నిలిచింది ‘కళావతి’.
Read Also : Srabanti Chatterjee : హీరోయిన్ పై కేసు… అడ్డంగా బుక్ చేసిన ముంగీస
పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మహేష్ బాబుకు జోడిగా కీర్తి సురేష్ నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ చిత్రాన్ని జిఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్, మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. “సర్కారు వారి పాట” మార్చి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక త్వరలోనే సినిమాలో నుంచి సెకండ్ సింగిల్ రిలీజ్ కు సన్నాహాలు చేస్తున్నాము అంటూ తమన్ ఇటీవల అప్డేట్ ఇవ్వడంతో ఇప్పుడు సూపర్ అభిమానులు ఆ సాంగ్ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు.