Kajol: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజోల్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.దిల్ వాలే దుల్హేనియా చిత్రంతో ముద్దుగుమ్మ అందరికి సుపరిచితురాలిగా మారిపోయింది. ఇక కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే హీరో అజయ్ దేవగణ్ ను ప్రేమించి పెళ్లి చేసుకొని సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. పిల్లలు, కుటుంబ బాధ్యతను చూసుకుంటూ కొంత సమయం ఇంటికే కేటాయించింది. ఇక ఓటిటీ వచ్చాక వెబ్ సిరీస్ లతో మరోసారి రీఎంట్రీ ఇచ్చింది కాజోల్. త్రిభంగ అనే సిరీస్ తో రీ ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపునే పొందింది. ఇక ఈ సిరీస్ తరువాత వరుసగా వెబ్ సిరీస్ లు, ఒరిజినల్ సినిమాల్లో నటిస్తోంది. ప్రస్తుతం కాజోల్.. లస్ట్ స్టోరీస్, ది గుడ్ వైఫ్ సినిమాల్లో నటిస్తోంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సిరీస్ లు త్వరలోనే రిలీజ్ కు సిద్ధమవుతున్నాయి. ఇకపోతే ఈ నేపథ్యంలోనే కాజోల్ కీలక నిర్ణయం తీసుకుంది. సోషల్ మీడియాకు ఆమె బ్రేక్ ఇస్తున్నట్లు ట్వీట్ చేసింది. “నా జీవితంలో కష్టతరమైన పరీక్షల్లో ఒకటి ఎదుర్కొంటున్నాను” అందుకే సోషల్ మీడియాకు కొద్దిగా బ్రేక్ తీసుకుంటున్నాను అని చెప్పుకొచ్చింది. ఈ ట్వీట్ చూసిన అభిమానులు అయ్యో ఏమైంది.. ? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక్క ఇంకొంతమంది ఇదంతా గుడ్ వైఫ్ ప్రమోషన్స్ అని చెప్పుకొస్తున్నారు.
Mahesh Babu: అస్సలు.. మహేష్ అన్నా.. నీకు ఇద్దరు పిల్లలు ఉన్నారన్న విషయం గుర్తుందా.. ?
సూపెర్న వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సిరీస్ త్వరలోనే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. ది గుడ్ వైఫ్ అనే ఇంగ్లిష్ సిరీస్ కు రీమేక్ గా ఈ సిరీస్ తెరకెక్కుతుంది. లాయర్ చదువుకున్న ఒక మహిళ పెళ్లి తరువాత తన కెరీర్ ను వదిలేసి గృహిణిగా సెటిల్ అవుతుంది. అయితే భర్త, పిల్లలతో సంతోషంగా జీవిస్తున్న ఆమె లైఫ్ లో కష్టాలు మొదలవుతాయి. భర్త.. ఒక సెక్స్ స్కాండల్ లో ఇరుక్కుంటాడు. అతనిని కాపాడడానికి ఆమె వదిలేసిన కెరీర్ ను మళ్లీ కొనసాగిస్తోంది. జైల్లో ఉన్న తన భర్త కోసం ఒక మహిళా లాయర్ ఎలా పోరాడింది అనేది ఈ సిరీస్ కథ. ఈ సిరీస్ కోసమే కాజోల్ ఫుల్ గా ప్రమోషన్స్ చేస్తుందని, అందుకే ఇలాంటి ట్వీట్ చేసిందని అంటున్నారు. మరి ఇందులో నిజం ఎంత అనేది తెలియాల్సి ఉంది.
Taking a break from social media. pic.twitter.com/9utipkryy3
— Kajol (@itsKajolD) June 9, 2023