Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం గుంటూరు కారం సినిమాతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. మహేష్ ఒక సినిమాలు చేస్తూనే.. ఇంకోపక్క యాడ్స్ కూడా చేస్తూ ఉంటాడన్న విషయం తెల్సిందే. నేషనల్, ఇంటర్నేషనల్ బ్రాండ్స్ కు మహేష్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నాడు. ఇక ఎప్పటికప్పుడు ఆ యాడ్స్ షూట్ లో ఫోటోషూట్స్ తో అభిమానులకు షాక్ ఇస్తూ ఉంటాడు. తాజాగా ఒక యాడ్ షూట్ కోసం మహేష్ దిగిన ఫొటోస్ నెట్టింట వైరల్ గా మారాయి. బ్లాక్ జీన్స్ పై వైట్ టీ షర్ట్.. దానిపై డెనిమ్ షర్ట్.. కర్లీ హెయిర్.. బ్లాక్ గాగుల్స్ తో మహేష్ అల్ట్రా స్టైలిష్ లుక్ ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. గుంటూరు కారం కన్నా మహేష్ హాట్ గా ఉన్నాడు అని అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు.
RRR: ఉరుముల దొరనే మెప్పించారంటే.. నిజంగా మీరు గ్రేట్ అయ్యా
మహేష్ వయస్సు 47. ఆయనకు పెళ్లి అయ్యి.. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. వారు కూడా రేపో మాపో ఇండస్ట్రీలో అడుగుపెట్టబోతున్నారు. కానీ, మహేష్ ను ఇలా చూస్తే .. వారికి నాన్న కాదు అన్న అనుకుంటారు అని అభిమానులు చెప్పుకొస్తున్నారు. టాలీవుడ్ లో ఈ రేంజ్ అందాన్ని మెయింటైన్ చేయడం నాటే ఎంతో కష్టంతో కూడుకున్న పని. ఈ అందం వెనుక మహేష్ నిరంతర శ్రమ ఉంది. ఆయన తినే తిండి, చేసే వర్క్ అవుట్స్ .. ఎవరు చేయలేరు. వయస్సు పెరిగేకొద్దీ ఎవరికై నా అందం తగ్గుతుంది. కానీ, మహేష్ విషయంలో మాత్రం అది రివర్స్ అని అంటున్నారు అభిమానులు.. వయస్సు పెరిగేకొద్దీ అందం తగ్గుతూ వస్తుంది.. ఈ ఫోటోలను చూసిన అభిమానులు.. అన్నా.. నీకు ఇద్దరు పిల్లలు ఉన్నారన్న విషయం గుర్తుందా.. ?.. ఏంటి అన్న ఈ అందం అంటూ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.