ప్రస్తుతం గర్భవతి అయిన కాజల్ అగర్వాల్ సోషల్ మీడియా ద్వారా బాడీ షేమర్స్ కు తగిన సమాధానం చెప్పింది. తనకు సంబంధించిన కొన్ని ఫోటోలను పంచుకుంటూ సుదీర్ఘమైన నోట్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అందులో ఈ సమయంలో తనను అసౌకర్యానికి గురి చేయాల్సిన అవసరం లేదని చెప్పింది.
Read Also : సామ్ బాటలో కీర్తి… హీరోయిన్ల క్రేజీ ఛాలెంజ్
ఆ నోట్ విషయానికొస్తే “నేను నా జీవితంలో, నా శరీరం, నా ఇల్లు, ముఖ్యంగా నా పని ప్రదేశంలో అత్యంత అద్భుతమైన కొత్త పరిణామాలతో వ్యవహరిస్తున్నాను. అదనంగా కొన్ని కామెంట్‌లు/ బాడీ షేమింగ్ మెసేజ్‌లు/ మీమ్‌లు నిజంగా సహాయం చేయవు 🙂 దయతో ఉండడం నేర్చుకుందాం. అది చాలా కష్టం కావచ్చు. జీవించి జీవించనివ్వండి! ఇలాంటి జీవిత పరిస్థితులను అనుభవిస్తున్న వారందరికీ, ఇది చదవాల్సిన అవసరం ఉన్నవారి కోసం ఇక్కడ నా ఆలోచనలు కొన్ని ఉన్నాయి. అలాగే ప్రసవించిన తర్వాత మనం మునుపటి స్థితికి రావడానికి కొంత సమయం పట్టవచ్చు లేదా గర్భం దాల్చడానికి ముందు మనం చూసుకున్న స్థితికి తిరిగి రాకపోవచ్చు” ఆమె ఈ అంశంపై మరిన్ని సలహాలు, సూచనలు చేస్తూ మరొక గమనికను కూడా రాసింది.
కాజల్ దంపతులు నూతన సంవత్సరం రోజున సోషల్ మీడియాలో అధికారికంగా తాము తల్లిదండ్రులం కాబోతున్నామన్న విషయాన్నీ ప్రకటించింది. ప్రస్తుతం కాజల్ సినిమాల నుంచి తాత్కాలికంగా విరామం తీసుకుంది. ఇప్పుడు కాజల్ అగర్వాల్ విడుదలకు సిద్ధంగా ఉన్న ‘ఆచార్య’లో కనిపించనుంది. శివ కొరటాల దర్శకత్వంలో రూపొందిన “ఆచార్య”లో చిరంజీవి, రామ్ చరణ్ కలిసి నటిస్తుండగా, పూజా హెగ్డే ప్రత్యేక పాత్రలో కనిపించనుంది. మరోవైపు బృందా దర్శకత్వంలో రూపొందిన రొమాంటిక్ డ్రామా “హే సినామిక”లో దుల్కర్ సల్మాన్ సరసన కూడా కాజల్ నటిస్తుంది. ఈ చిత్రంలో అదితి రావ్ హైదరి రెండవ కథానాయికగా నటిస్తుంది. “హే సినామిక” మార్చి 3న థియేటర్లలోకి రానుంది.