పెళ్లయ్యాక హీరోయిన్లు దాదాపు సినిమాలకు దూరంగా ఉంటారు. ఇక తల్లి అయ్యాక మాత్రం పూర్తిగా స్వస్తి పలుకుతారు. తమ భర్త, పిల్లలతో హ్యాపీగా వ్యక్తిగత జీవితంలో లీనమైపోతారు. ఒకవేళ భాగస్వామి నుంచి ఎలాంటి అభ్యంతరాలు లేకపోతే, తిరిగి సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తారు. ఇలా కొందరు కథానాయికలు పునరాగమనం ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు వీరి జాబితాలోకి త్వరలో కాజల్ అగర్వాల్ చేరబోతోంది. అవును, మీరు చదువుతోంది అక్షరాల నిజం. ప్రస్తుతం మదర్‌హుడ్‌ని ఎంజాయ్ చేస్తోన్న ఈ నటి.. త్వరలోనే సినిమాల్లోకి కంబ్యాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. ఇందుకు సంబంధించిన ప్లానింగ్స్ కూడా జరుగుతున్నాయని సమాచారం.
అలాగని ఇప్పుడే కొత్త ప్రాజెక్టులకు సంతకం చేయట్లేదు. అన్నీ కుదిరితే, వచ్చే ఏడాదిలో కాజల్ పునరాగమనం ఉండొచ్చు. అయితే.. ఇక్కడో మెలిక ఉంది. ఇంతకుముందు లాగా కాజల్ గ్లామర్ రోల్స్ చేయదట! కేవలం నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలే, అందునా ఫీమేల్-సెంట్రిక్ సినిమాలు మాత్రమే చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలిసింది. కాబట్టి, తన వద్దకు కమర్షియల్ కథలతో రావొద్దని ముందే సంకేతాలు ఇస్తోందన్నమాట! స్టోరీ గనుక కాజల్‌ని ఎంగేజ్ చేయగలిగేలా ఉంటే, వచ్చే ఏడాదిలో ఆమె కంబ్యాక్ తథ్యం. కాజల్‌కి ఇప్పటికీ మంచి క్రేజ్ ఉంది కాబట్టి.. ఆమె సింగిల్ హ్యాండెడ్‌గా ఫీమేల్-సెంట్రిక్ సినిమాలను లాగగలదు. మరి, కాజల్ ఎలాంటి సినిమాతో కంబ్యాక్ ఇస్తుందో చూడాలి.