సౌత్ చందమామ కాజల్ అగర్వాల్ ప్రెగ్నెన్సీ అంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. 2021 అక్టోబర్ లో తన చిరకాల మిత్రుడు, వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లును కాజల్ వివాహం చేసుకున్న చేసుకుంది. అప్పటి నుంచి ఈ జంట మధురమైన క్షణాలను కలిసి గడుపుతున్నారు. ఎప్పటికప్పుడు తమ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అభిమానులతో సంతోషమైన క్షణాలను పంచుకుంటున్నారు. కాగా కాజల్ అగర్వాల్, గౌతమ్ కిచ్లు కలిసి తమ మొదటి బిడ్డను స్వాగతించడానికి సిద్ధంగా ఉన్నారని చిత్ర పరిశ్రమలో టాక్ నడుస్తోంది. ఇన్ని రోజులూ ఈ విషయంపై మౌనంగా ఉన్న కాజల్ అగర్వాల్ ఇప్పుడు ఎట్టకేలకు తన మౌనాన్ని వీడి ప్రెగ్నెన్సీ గురించి మాట్లాడింది.
Read Also : “ఆర్ఆర్ఆర్” ఊర నాటు సాంగ్ ప్రోమో
కాజల్ అగర్వాల్ మాట్లాడుతూ ”ఇప్పుడే దాని గురించి మాట్లాడటం ఇష్టం లేదు. సమయం వచ్చినప్పుడు నేను దాని గురించి చెబుతాను” అంటూ అసలు విషయాన్నీ దాటవేసింది. మరోవైపు తన సోదరి నిషా తల్లిగా మారడం చూసి మాతృత్వంపై తనకు కలిగిన భావాల గురించి చెప్పుకొచ్చింది. మాతృత్వం గురించి కాజల్ మాట్లాడుతూ ఆమె జీవితం ఎలా మారిందో నేను చూశాను. మాతృత్వం ఒక అద్భుతమైన అనుభూతి అని నేను అనుకుంటున్నాను. నా ఇద్దరు మేనల్లుళ్లు కబీర్, ఇషాన్‌ల సహవాసంలో నేను ఇప్పటికే తల్లిలా భావిస్తున్నాను అని చెప్పాలి అని పేర్కొంది. అయితే కాజల్ ప్రెగ్నెన్సీ విషయంలో మాత్రం అభిమానులు ఇంకా అయోమయంగానే ఉన్నారు.