Jyothika: ఇక చాలు.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి.. జ్యోతిక సంచలన పోస్ట్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jyothika: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న నీట్ (NEET-UG) పేపర్ లీక్ వివాదంపై కోలీవుడ్ స్టార్ నటి జ్యోతిక ఘాటుగా స్పందించారు. ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న విద్యార్థుల నిరసనలకు బహిరంగ మద్దతు ప్రకటిస్తూ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. విద్యా వ్యవస్థలో పారదర్శకత, బాధ్యత లేకపోతే దేశ భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసిన సుదీర్ఘ సందేశంలో జ్యోతిక, ‘జై హింద్’ అంటూ విద్యార్థుల పోరాటానికి సంఘీభావం తెలిపారు. దేశ భవిష్యత్తు అయిన విద్యార్థుల కోసం తాను గళం విప్పుతున్నానని పేర్కొంటూ, విద్యా వ్యవస్థలో సమూల సంస్కరణలు అవసరమని స్పష్టం చేశారు. ‘ధర్మేంద్ర ప్రధాన్… మీ పదవి నుంచి తప్పుకోండి, పారదర్శకమైన ప్రజాస్వామ్య భారతదేశం కోసం నేను విద్యార్థుల పక్షాన నిలుస్తున్నాను అంటూ ఆమె తన డిమాండ్‌ను స్పష్టంగా వినిపించారు.
అంతేకాకుండా 20 రోజులకుపైగా నిరాహార దీక్ష చేసిన సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్, అలాగే ఉద్యమంలో పాల్గొంటున్న అభిజిత్ దిప్కే, సౌరవ్ దాస్‌లకు జ్యోతిక ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఒక తల్లిగా తన పిల్లలు కూడా భవిష్యత్తులో ఇలాంటి అన్యాయాలపై ధైర్యంగా ప్రశ్నించే వ్యక్తులుగా ఎదగాలని కోరుకుంటున్నానని ఆమె ఎమోషనల్ గా స్పందించారు. యువత భయపడకుండా ఏకమై పోరాడుతున్న తీరును జ్యోతిక ప్రశంసించారు. విద్యార్థుల్లోని భయాన్ని తొలగించి, ధైర్యంగా ముందుకు వచ్చేలా చేసిన ‘కాక్రోచ్ జనతా పార్టీ (CJP)’కి కూడా ఆమె ధన్యవాదాలు తెలిపారు. ఇదిలా ఉండగా, నీట్ వివాదంపై ఇప్పటికే సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు కూడా స్పందించారు. అలియా భట్, సల్మాన్ ఖాన్, హుమా ఖురేషి, సాకిబ్ సలీమ్, సోనాక్షి సిన్హా, ప్రకాష్ రాజ్, నసీరుద్దీన్ షా, రత్నా పాఠక్ షా, స్వర భాస్కర్ తదితరులు విద్యార్థులకు మద్దతు ప్రకటించారు.
Also Read
- Salman Khan: ట్రోల్స్‌కు సిక్స్‌ప్యాక్‌తో సమాధానం.. 60 ఏళ్లకూ సల్మాన్ స్టామినా ఇదే!
- Viswanath And Sons: సూర్య సినిమాకు జ్యోతిక టచ్.. రిలీజ్ తర్వాతే ఆ సీక్రెట్ రివీల్!
- Tamannaah Bhatia: దక్షిణాదిలో ఆంక్షలు.. హిందీలో స్వేచ్ఛ.. తమన్నా షాకింగ్ కామెంట్స్!
- Ramayana Promotion Budget: ప్రమోషన్స్ కోసం కళ్లు చెదిరే బడ్జెట్.. ప్రపంచాన్ని టార్గెట్ చేసిన రామాయణం!
జూలై 20న పార్లమెంట్ వైపు సాగిన విద్యార్థుల మార్చ్ సందర్భంగా జరిగిన లాఠీచార్జ్, టియర్ గ్యాస్ ప్రయోగం దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. మరోవైపు పేపర్ లీక్ కేసులో నిందితులను అరెస్ట్ చేశామని, విచారణను వేగవంతం చేసేందుకు ఫాస్ట్‌ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తున్నామని ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికే ప్రకటించారు. అయినప్పటికీ, విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసే వరకు తమ ఉద్యమం కొనసాగుతుందని విద్యార్థి సంఘాలు స్పష్టం చేస్తున్నాయి.
తాజావార్తలు
-
Jyothika: ఇక చాలు.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి.. జ్యోతిక సంచలన పోస్ట్!
-
Soft Foods for Seniors: దంతాలు లేని వారికి ఏ ఆహారం మంచిది? సులభంగా తినగలిగే పోషకాహారాల పూర్తి జాబితా
-
Salman Khan: ట్రోల్స్‌కు సిక్స్‌ప్యాక్‌తో సమాధానం.. 60 ఏళ్లకూ సల్మాన్ స్టామినా ఇదే!
-
Mohan Bhagwat: “నేటి తరం దారి తప్పలేదు”.. సీజేపీ నిరసనల వేళ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు..
-
Samsung Galaxy F70 Pro: సామ్ సంగ్ గెలాక్సీ F70 ప్రో.. 6000mAh బ్యాటరీ, Snapdragon 6 Gen 3 చిప్సెట్
ట్రెండింగ్
-
Smart Money Rules: జీవితాన్ని మార్చే స్మార్ట్ ‘మనీ రూల్స్’.! ఆర్థికంగా బలపడాలంటే తప్పక తెలుసుకోవాల్సిన సూత్రాలు ఇవే..
-
12.1 అంగుళాల 2.5K డిస్ప్లే, 10,200mAh బ్యాటరీతో రానున్న Moto Pad 70.!
-
3.2 అంగుళాల టచ్‌స్క్రీన్, Doubao AIతో HMD Touch AI ఫీచర్ ఫోన్ లాంచ్.!
-
డ్యూయల్ 200MP కెమెరాలు, ఐఫోన్-స్టైల్ బార్ తో రాబోతున్న OPPO Find X10..!
-
Rainy Season Kitchen Tips : వర్షాల్లో బియ్యానికి పురుగులా? ఇలా చేస్తే సమస్యే లేదు.!