Mirzapur The Movie: ఓటీటీ సిరీస్ చరిత్రలోనే సరికొత్త రికార్డ్.. 7 రోజుల్లోనే రూ.200 కోట్ల క్లబ్లో ‘మీర్జాపూర్’!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mirzapur The Movie: ఓటీటీలో ఒక సిరీస్ సూపర్‌హిట్ అయితే ప్రేక్షకులు దాన్ని థియేటర్లలో చూడటానికి మళ్లీ డబ్బులు పెట్టి వస్తారా? ఒకప్పుడు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడం చాలా కష్టంగా ఉండేది. కానీ ఇప్పుడు ‘మీర్జాపూర్’ ఆ అనుమానాలన్నింటినీ పటాపంచలు చేస్తోంది. వెబ్ సిరీస్‌గా మొదలై కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఈ ఫ్రాంచైజీ.. ఇప్పుడు వెండితెరపై కూడా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. కేవలం ఏడు రోజుల్లోనే రూ.200 కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ ఇచ్చి మరిన్ని రికార్డులను బద్దలు కొట్టబోతోంది. అయితే ఈ హిట్ మాత్రం ఓటీటీ నుంచి థియేటర్లకు వస్తున్న ఫ్రాంచైజీల విషయంలోనూ కొత్త చర్చకు తెరలేపింది.
గుర్మీత్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘మీర్జాపూర్: ది మూవీ’ సెప్టెంబర్ 4న థియేటర్లలో విడుదలైంది. పంకజ్ త్రిపాఠి, అలీ ఫజల్, దివ్యేందు తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా తొలి రోజు నుంచే మంచి వసూళ్లను రాబడుతోంది. సెప్టెంబర్ 10తో మొదటి వారం పూర్తయ్యేసరికి సినిమా ఇండియాలో రూ.148.45 కోట్ల నెట్ కలెక్షన్ సాధించినట్లు ట్రేడ్ రిపోర్టులు చెబుతున్నాయి. ఇండియా గ్రాస్ సుమారు రూ.176.94 కోట్లు కాగా, ఓవర్సీస్ మార్కెట్ నుంచి మరో రూ.35.50 కోట్ల గ్రాస్ రావడంతో వరల్డ్‌వైడ్ గ్రాస్ రూ.212.44 కోట్లకు చేరింది. అంటే విడుదలైన ఏడో రోజుకే ఈ సినిమా ఆఫీషియల్ గా రూ.200 కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టింది. ఈ వసూళ్లతో ‘మీర్జాపూర్: ది మూవీ’ మరో ఘనతను కూడా అందుకుంది. ఇమ్రాన్ హష్మి నటించిన ‘ఆవారాపన్ 2’ వసూళ్లను దాటి 2026లో అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ హిందీ సినిమాల జాబితాలో చోటు సంపాదించింది.
Also Read
- Bloody Romeo : రోమియో పక్కన జూలియట్‌గా ప్రీతిముకుందన్?
- Aadarsha Kutumbam : 'ఆదర్శ కుటుంబం' మళ్లీ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
- Srinidhi Shetty: "కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు.." శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
- Sardar 2 OTT: ఓటీటీలో 'సర్దార్ 2' ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే.. మీర్జాపూర్‌కు ఇంతటి క్రేజ్ రావడానికి కారణం ఒక్క సినిమా కథ మాత్రమే కాదు. ఇప్పటికే మూడు సీజన్లుగా ఓటీటీలో ఈ ఫ్రాంచైజీకి ఏర్పడిన భారీ ఫ్యాన్ బేస్ ఇప్పుడు థియేటర్లలోకి మారింది. కాలీన్ భయ్యా, గుడ్డు పండిట్, మున్నా భయ్యా వంటి పాత్రలతో ప్రేక్షకులకు ఉన్న ఎమోషనల్ కనెక్షన్ సినిమాకు అడ్వాన్స్ బజ్ తీసుకొచ్చింది. ఆ అభిమానంతోనే బాక్సాఫీస్ వద్ద ఈ రేంజ్ వసూళ్లు సాధ్యమయ్యాయని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఇప్పటివరకు ఓటీటీ కోసం ప్రత్యేకంగా తయారైన వెబ్ సిరీస్‌లను థియేటర్లలోకి తీసుకురావడం పెద్ద రిస్క్‌గా భావించేవారు. ఎందుకంటే ఆడియన్స్ ఇప్పటికే ఆ కథను ఇంట్లోనే చూసి ఉంటారు. అలాంటప్పుడు అదే ఫ్రాంచైజీ కోసం మళ్లీ థియేటర్ టికెట్ ఎందుకు కొనాలి అనే ప్రశ్న ఉండేది. కానీ మీర్జాపూర్ ఆ లెక్కను పూర్తిగా మార్చేసింది. ఈ హిట్ ఫ్రాంచైజీని భారీ స్క్రీన్‌పై చూడాలని అభిమానులు థియేటర్లకి క్యూ కట్టినట్లు కనిపిస్తోంది.
ఈ హిట్ తో ఇప్పుడు ‘స్కామ్ 1992’, ‘ది ఫ్యామిలీ మ్యాన్’, ‘ఢిల్లీ క్రైమ్’ వంటి భారీ ఫ్యాన్ బేస్ ఉన్న వెబ్ సిరీస్‌ల గురించి కూడా చర్చ మొదలైంది. ఇవి కూడా ఎప్పుడైనా థియేటర్లకు వస్తాయా అనే ప్రశ్నలు కూడా ప్రేక్షకుల్లో మొదలయ్యాయి. అయితే ప్రతి సిరీస్‌ను సినిమాగా మార్చితే ఇదే ఫలితం వస్తుందని మాత్రం చెప్పలేం. ఓటీటీలో ఉన్న కంటెంట్‌ను యథాతథంగా వెండితెరపైకి తీసుకురావడం సరిపోదు. థియేటర్ ఆడియన్స్‌కు మరింత పెద్ద స్కేల్, సరైన రన్టైమ్తో పాటు భారీ ప్రమోషన్ కూడా అవసరం. ప్రస్తుతం ‘మీర్జాపూర్: ది మూవీ’ మాత్రం ఈ ప్రయోగంలో సక్సెస్ఫుల్ మోడల్‌గా నిలుస్తోంది. ఓటీటీలో పుట్టిన ఫ్రాంచైజీ కూడా థియేటర్లలో వందల కోట్ల బిజినెస్ చేయగలదని ఈ సినిమా చూపించింది. ఇదే ట్రెండ్ కొనసాగితే భవిష్యత్తులో ప్రముఖ ఓటీటీ ఫ్రాంచైజీలను థియేటర్లలోకి తీసుకొచ్చేందుకు నిర్మాతలు, స్ట్రీమింగ్ సంస్థలు ముందుకు వచ్చే అవకాశం ఉంది. మరి మీర్జాపూర్ తర్వాత ఆ జాబితాలో ఏ వెబ్ సిరీస్ వెండితెరపైకి వస్తుందో చూడాలి.
- Tags
- cinema
- Mirzapur The Movie
తాజావార్తలు
-
Bloody Romeo : రోమియో పక్కన జూలియట్‌గా ప్రీతిముకుందన్?
-
Tirumala Leopard : తిరుమల నడకమార్గంలో చిరుత.. భక్తులకు టీటీడీ అలర్ట్.!
-
Imran Khan Release Protest: ఇమ్రాన్ ఖాన్ విడుదల కోసం భారీ ఉద్యమం.. ఇస్లామాబాద్‌లో 144 సెక్షన్, 2 వేల మంది అరెస్ట్
-
Primebook 3 Max: రూ.35,990కే కొత్త ల్యాప్‌టాప్.. 12 గంటల బ్యాటరీ, 8GB RAM, AI ఫీచర్లతో Primebook 3 Max
-
Aadarsha Kutumbam : ‘ఆదర్శ కుటుంబం’ మళ్లీ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!