Jyothi Emotional Comments on her Early Days in Movie Industry: క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బోల్డ్ తరహా పాత్రలు చేసి మంచి ఫేమస్ అయింది జ్యోతి. ఒక సినిమాలో ఆమె చేసిన తిలోత్తమ అనే క్యారెక్టర్‌తో అయితే చాలా మందికి గుర్తు ఉండిపోయింది. తెలుగులో పలు సినిమాల్లో రొమాంటిక్ క్యారెక్టర్, కామెడీ సీన్స్‌లలో నటించి తన నటనతో అందరినీ ఆకట్టుకుంది. పెళ్లాం ఊరెళితే, ఎవడి గోల వాడితే, దరువు, యముడికి మొగుడు ఇలా చాలా సినిమాల్లో ఆమె పాత్రలు గుర్తుండి పోయేలా ఉంటాయి. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె చేసిన ఎమోషనల్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. జ్యోతి వ్యాంప్ పాత్రలు చేసేవారిని చాలా చులకనగా చూస్తారని, నేను అలాంటి సిట్యువేషన్స్ ఎదుర్కొన్నానని పేర్కొంది.
Kalki – Bujji: 6 టన్నులు-6 కోట్లు.. 30 గంటలు.. ‘బుజ్జి’ గురించి షాకింగ్ ఫ్యాక్ట్స్!
నా జీవితంలో నేను మరిచిపోలేని సంఘటన ఏదైనా ఉన్నదా అంటే.. శృంగార పరమైన పరోపణలు ఎదుర్కోవడం అని ఆమె అన్నారు. ఆ సమయంలో నేను ఉన్న అద్దె ఇంటి నుంచి నన్ను ఖాళీ చేసి వెళ్లి పొమ్మన్నారు. రెండేళ్ల నా కొడుకుని ఎత్తుకుని అద్దె ఇంటి కోసం వీధి వీధి తిరిగా కానీ నాకు అద్దె ఇల్లు ఇవ్వడానికి ఎవ్వరూ ముందుకు రాలేదు. దీనితో నా కొడుకుని ఎత్తుకొని నడి రోడ్డులో ఏడ్చుకుంటూ కుర్చున్నానని ఆమె ఎమోషనల్ అయ్యింది. ఇండస్ట్రీలో కూడా నన్ను చాలా చులకనగా చూసేవారని, ఆ ఆరోపణల తర్వాత నా స్నేహితులు కూడా దూరం అయ్యారు, ఎవరూ నాకు సహకరించలేదని ఆమె కామెంట్ చేసింది. చాలా ఒంటరిని అయిపోయానని, ఆ క్షణం నా జీవితంలో మర్చిపోలేనిదని ఆమె పేర్కొంది. నేను తప్పు చేసి ఉంటే ఒకే కానీ ఏ తప్పు చేయకున్నా ఆరోపణలు వచ్చినందుకు వాళ్లు నన్ను అలా చేయడం బాధేసిందని ఆమె చెప్పుకొచ్చింది.