JR NTR : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ కు అగ్ని ప్రమాదం ఘటన.. దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. పవన్ కు ప్రధాన మంత్రి నరేంద్రమోడీ నుంచి.. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మాజీ సీఎంలు, సెలబ్రిటీలు.. అందరూ ధైర్యం చెబుతున్నారు. ఫోన్ లు చేసి, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి మరీ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. ‘పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ కు అగ్ని ప్రమాదం జరిగిన ఘటన నన్ను కలిచివేసింది. అతను త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా. ఈ టైమ్ లో పవన్ కల్యాణ్ కు శక్తి, మనోధైర్యం ఇవ్వాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నా’ అంటూ రాసుకొచ్చారు. ఇక పవన్ కల్యాణ్ నిన్న రాత్రి సింగపూర్ బయలుదేరి వెళ్లారు.
Read Also : Jaat : తెలుగులోనూ ‘జాట్’.. ఎప్పుడంటే?
మార్క్ శంకర్ ను చూసి.. ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ఈ రోజు ఉదయమే ఎమర్జెన్సీ వార్డు నుంచి జనరల్ వార్డుకు షిఫ్ట్ చేశారు. మెగాస్టార్ చిరంజీవి, సురేఖ దంపతులు కూడా బయలుదేరి వెళ్లారు. మార్క్ శంకర్ కు మూడు రోజుల పాటు చికిత్స అవసరం అని డాక్టర్లు సూచించారు. పవన్ కల్యాణ్ మరికొన్ని రోజుల పాటు అక్కడే ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. మార్క్ శంకర్ కాళ్లు, చేతులకు గాయాలు అయ్యాయి. ఊపరితిత్తుల్లోకి పొగ వెళ్లి స్ట్రక్ అవడం వల్ల కొంత సమస్య ఏర్పడింది. దాని కోసం ప్రత్యేకంగా చికిత్స అందిస్తున్నారు డాక్టర్లు. ప్రస్తుతానికి ఆరోగ్యం నిలకడగానే ఉంది.