Jr NTR’s look in WAR 2 Leaked: ఒకపక్క హీరోగా నటిస్తూనే మరోపక్క మల్టీ స్టారర్లు కూడా చేయడానికి జూనియర్ ఎన్టీఆర్ ఏ మాత్రం వెనకాడడం లేదు. అలా ఆయన చేసిన ఆర్ఆర్ఆర్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ప్రస్తుతానికి జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమా మీద తన ఫోకస్ అంతా పెట్టాడు. అయితే దేవర సినిమా ఒప్పుకోకముందే ఆయన మరో మల్టీస్టారర్ కూడా ఒప్పుకున్నాడు. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ హీరోగా నటిస్తున్న వార్ సినిమా సీక్వెల్ వార్ 2 సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇక తాజాగా ఈ సినిమాకి సంబంధించిన జూనియర్ ఎన్టీఆర్ లుక్ బయటకు వచ్చింది. జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్ నుంచి ముంబై వెళ్లారు.
Pushpa 2 : వామ్మో.. ఆ ఒక్క సీన్ కోసం అన్ని కోట్లు ఖర్చు పెట్టవా సుక్కు..?
ఈ నేపద్యంలో ఎయిర్పోర్ట్ లోని ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ వార్ 2 లుక్ లీక్ అయిందంటూ నేషనల్ మీడియా మొత్తం పెద్ద ఎత్తున హల్చల్ చేస్తుంది. యష్ రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్ లో భాగంగా ఈ సినిమాని వార్ సినిమా డైరెక్టర్ చేసిన అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేస్తున్నాడు. ఇక ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ఒకరితో ఒకరు పోరాడే పాత్రలలో కనిపించబోతున్నారు. కియారా అద్వానీ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాని వచ్చే ఏడాది ఆగస్టు 14వ తేదీన రిలీజ్ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇక తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోల బట్టి చూస్తుంటే జూనియర్ ఎన్టీఆర్ ఒక బ్లూ కలర్ ఫుల్ హాండ్స్ షర్ట్ ధరించి క్యాప్ ధరించి కనిపిస్తున్నాడు. ఆయన స్టైలిష్ గాగుల్స్ లుక్ ని మరింత ఎలివేట్ చేసేలా ఉన్నాయి. ఇక ఎన్టీఆర్ ఫోటోలు చూసి కటౌట్ అదిరింది అంటూ ఆయన అభిమానులు కామెంట్ చేస్తున్నారు.