ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ దర్శకత్వం రాబోతున్న సినిమా పుష్ప2.. ఈ సినిమా ఈ ఏడాది ఆగస్టు 15 ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్నారు.. ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక మందన్న నటిస్తుంది.. ఇటీవల బన్నీ బర్త్ డే సందర్బంగ టీజర్ ను విడుదల చేశారు.. ఆ టీజర్ బన్నీ ఫ్యాన్స్ తో పాటుగా సినీ ప్రేక్షకులకు బాగా నచ్చేసింది.. అందులో అమ్మవారి గెటప్ లో అల్లు అర్జున్ కనిపిస్తున్నాడు..
ఆ సీన్ సినిమాకు హైలెట్ గా నిలుస్తుంది.. ఇక సీన్ కోసం ఏకంగా అరవై కోట్లు ఖర్చు చేశారని వార్తలు వినిపిస్తున్నాయి.. గతంలో 30 కోట్లు అని వార్తలు వినిపించాయి.. జాతర సీన్ తీయడం కోసం భారీ బడ్జెట్ తో రూపొందించిన సెట్ అవసరమైందన్నది మాత్రం నేను చెప్పగలను. స్టోరీలో కీలకమైన సీన్ కావడంతో మేకర్స్ చాలా శ్రమించారు.. అల్లు అర్జున్ కూడా బాగా కష్టపడి ఆ సీన్ చేశారట.. ఏదేమైన ఆ లుక్ మాత్రం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది..
ఇదిలా ఉండగా ఈ సినిమా ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ ఇప్పటికే రూ.100 కోట్లకు దక్కించుకున్నట్లు సమాచారం. పుష్ప 1 ఓటీటీ హక్కులను ప్రైమ్ వీడియో రూ.30 కోట్లకు దక్కించుకుంది.. గతంలో వచ్చిన పుష్ప సినిమా భారీ విజయాన్ని అందుకోవడం వల్ల ఇప్పుడు రాబోతున్న సినిమా పై అంచనాలు కూడా భారీగా పెరుగుతున్నాయి.. ఇక ఫహద్ ఫాజిల్, జగపతి బాబు, బ్రహ్మాజీ, అనసూయ భరద్వాజ్, సునీల్ లాంటి వాళ్లు నటించారు. ఈ మూవీ ఐదు భాషల్లో పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ కానుంది..