Dragan : జూనియర్ ఎన్టీఆర్ హీరోగా వస్తున్న డ్రాగన్ సినిమాపై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాపై అభిమానులు ఓ రేంజ్ లో అంచనాలు పెట్టేసుకున్నారు. అయితే ఈ సినిమాను 2026 జూన్ 25న రిలీజ్ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు. కానీ అనుకున్న డేట్ కు ఈ సినిమా రావడం కష్టమే అంటున్నారు. ఎందుకంటే ఈ సినిమా నిర్మాతల్లో ఒకరైన రవిశంకర్ తాజాగా మాట్లాడుతూ… ఈ నెలాఖరులో డ్రాగన్ మూవీ షూటింగ్ స్టార్ట్ అవుతుందని.. సమ్మర్ ఎండింగ్ వరకు కంటిన్యూగా ఉంటుందన్నారు.
Read Also : Deepika Padukone : కండీషన్ల గురించి చెప్పని దీపిక.. ఏంటమ్మా ఈ కవరింగులు
దీంతో అభిమానుల్లో మళ్లీ అనుమానాలు మొదలయ్యాయి. సమ్మర్ ఎండింగ్ వరకు అంటే జూన్ వచ్చేస్తుంది. అప్పటి వరకు షూటింగ్ చేయడం అంటే.. మిగిలిన పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ ఎప్పుడు చేస్తారు.. అంటే ఈ లెక్కన డ్రాగన్ వాయిదా పడటం ఖాయమేనే అంటున్నారు. ప్రశాంత్ నీల్ కు తన సినిమాలను వాయిదా వేయడం కూడా అలవాటే. గతంలో సలార్ సినిమాను సెప్టెంబర్ లో రిలీజ్ చేస్తామని చెప్పి.. చివరకు డిసెంబర్ లో రిలీజ్ చేశారు. రేపు డ్రాగన్ పరిస్థితి కూడా అంతే కావచ్చేమో అంటున్నారు.
Read Also : SS Rajamouli : రాజమౌళికి జక్కన్న అనే బిరుదు ఎవరు ఇచ్చారో తెలుసా..?