WAR 2 : జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ వార్-2. హృతిక్ రోషన్ తో కలిసి ఇందులో ఆయన నటిస్తున్నారు. అయితే ఈ సినిమాపై చాలా అనుమానాలు ఉన్నాయి. ఇందులో ఎన్టీఆర్ విలన్ రోల్ అని.. సెకండ్ హీరో అని రకరకాల ప్రచారాలు మొన్నటి దాకా జరిగాయి. అందుకే ఎన్టీఆర్ మూవీ రేంజ్ లో అడ్వాన్స్ టికెట్లు కూడా అమ్ముడు పోవట్లేదు. దీనిపై నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ లో క్లారిటీ ఇచ్చారు ఎన్టీఆర్. ఆయన మాట్లాడుతూ అందరూ అనుకున్నట్టు ఇది హిందీ డబ్బింగ్ సినిమా కాదు. నేను హిందీలోకి వెళ్లట్లేదు. హృతిక్ రోషన్ నే తెలుగులోకి తీసుకొస్తున్నాం అన్నాడు.
Read Also : Bigg Boss 9 : బిగ్ బాస్-9 కోసం నాగార్జున భారీ రెమ్యునరేషన్..
ఇది పక్కా తెలుగు సినిమా అని.. అందరూ కాలర్ ఎగరేసుకునేలా ఈ సినిమా ఉంటుందన్నాడు. ఇక్కడే కొన్ని క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. అసలు వార్-2 అనేది వార్ సినిమాకు సీక్వెల్. వార్ సినిమాలో హీరో హృతిక్, డైరెక్టర్ అయాన్, ప్రొడ్యూసర్ ఆదిత్య చోప్రా. అది పక్కా బాలీవుడ్ మూవీ. అందులో ఉన్న వారంతా బాలీవుడ్ వాళ్లే. దానికి సీక్వెల్ గా వస్తున్న వార్-2లో అందరూ బాలీవుడ్ వాళ్లే. అదే టీమ్ కంటిన్యూ అవుతోంది. ఒక్క జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే అందులో యాడ్ అయ్యాడు. అంతకు మించి తెలుగు నుంచి ఒక్కరు కూడా లేరు. అలాంటప్పుడు ఇది పక్కా తెలుగు సినిమా అని చెప్పలేం కదా అంటున్నారు నెటిజన్లు. ఇంకో విషయం ఏంటంటే హృతిక్ రోషన్ ను తెలుగులోకి తెస్తున్నాం అంటున్నారు. కానీ టీమ్ అంతా బాలీవుడ్ దే కదా. అలాంటప్పుడు ఎన్టీఆర్ బాలీవుడ్ లో చేస్తున్న మూవీ అవుతుంది గానీ.. హృతిక్ తెలుగులోకి వస్తున్నట్టు ఎలా అవుతుందని ప్రశ్నిస్తున్నారు సోషల్ మీడియా నెటిజన్లు. ఇప్పటికే రన్ టైమ్, టీజర్ లో హిందీకే ఇంపార్టెన్స్ ఇచ్చారు. మరి సినిమాలో ఎవరికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుందో చూడాలి.
Read Also : War 2 Pre Release Event : నన్ను ఎవ్వరూ ఆపలేరు.. జూనియర్ ఎన్టీఆర్ ఎమోషనల్