Dhamaka: మాస్ మహరాజా రవితేజ లేటెస్ట్ మూవీ ‘ధమాకా’. ఈ సినిమా నుండి వచ్చిన ఫస్ట్ లిరికల్ వీడియో సాంగ్ ‘జింతాక్’ రవితేజా కెరీర్ లోనే ది బెస్ట్ సాంగ్ గా నిలిచింది. రవితేజ కెరీర్ లో బోలెడన్ని సూపర్ హిట్ సాంగ్స్ ఉన్నాయి. మరెన్నో మ్యూజికల్ హిట్ మూవీస్ కూడా ఉన్నాయి. అయితే ‘థమాకా’లోని ‘జింతాక్’ లిరికల్ వీడియో ఆ పాత పాటల రికార్డ్స్ అన్నింటినీ అధిగమించేసింది. ఈ పాట ఇప్పటికీ 35 మిలియన్స్ కు పైగా వ్యూస్ ను పొందడంతో పాటు, ఇన్ స్టాగ్రామ్ లో 250 మిలియన్స్ కు పైబడి రీల్స్ చేసిన సాంగ్ గా సరికొత్త రికార్డ్ ను నమోదు చేసుకుంది.
‘జింతాక్’ లిరికల్ వీడియో సాంగ్ విడుదలైన దగ్గర నుండి ఓ ఫ్లో లో అది సోషల్ మీడియాలో దూసుకుపోయింది. హీరో హీరోయిన్లు రవితేజా, శ్రీలీలా వేసిన మాస్ స్టెప్స్ అందరినీ విపరీతంగా ఆకట్టుకున్నాయి. ‘నిన్ను సూడబుద్దైతాంది రాజిగో… మాట్లాడబుద్దైతాంది రాజిగో’ అంటూ కాసర్ల శ్యామ్ జానపద రీతిలో రాసిన ఈ గీతానికి భీమ్స్ స్వర రచన చేయడమే కాకుండా మంగ్లీతో కలిసి పాడారు. దీనికి శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు. ‘ధమాకా’ సినిమా నుండి వచ్చిన ఈ ఫస్ట్ సాంగ్ సూపర్ హిట్ కావడంతో ఆ తర్వాత వచ్చిన పాటలూ అదే రీతిలో వైరల్ కావడం మొదలైంది. విడుదలకు ముందే మ్యూజికల్ హిట్ అనిపించుకున్న ‘ధమాకా’ చిత్రం డిసెంబర్ 23న జనం ముందుకు రాబోతోంది. త్రినాథ రావ్ నక్కిన దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్న ఈ సినిమాకు వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత. ప్రసన్న కుమార్ బెజవాడ ఈ చిత్రానికి కథ, స్క్రీన్ప్లే, సంభాషణలు అందించగా, కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు.