విజయ దేవరకొండ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే లైగర్ సినిమాను పూర్తిచేసే పనిలో ఉన్న విజయ్ ఈ సినిమా తరువాత పూరి కాంబోలోనే జెజిఎమ్ ని పట్టాలెక్కించనున్నాడు. ఇవి కాకుండా ఇటీవలే మరో రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇకపోతే పాన్ ఇండియా సినిమాలుగా తెరకెక్కుతున్న లైగర్ లో రౌడీ హీరో సరసన బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే నటిస్తోంది. ఇక జనగణమణ చిత్రంలో ఇప్పటికే జూనియర్ అతిలోక సుందరి జాన్వీ కపూర్ ను తీసుకున్నట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. ఆహా.. రెండు పాన్ ఇండియా సినిమాల్లో ఇద్దరు బాలీవుడ్ భామలను దింపేశాడు పూరి.. విజయ్ లక్ అలా కలిసొచ్చింది అంటూ నెటిజన్స్ కామెంట్స్ పెట్టడమే కాకుండా జాన్వీ కపూర్ ను ట్యాగ్ చేస్తూ వెల్ కమ్ తో టాలీవుడ్ అంటూ విషెస్ చెప్తున్నారు.
ఇక తాజాగా ఈ విషయమై అమ్మడు స్పందించింది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ ముద్దుగుమ్మ రౌడీ హీరోతో సినిమాపై గుట్టు విప్పింది.త్వరలోనే విజయ్ దేవరకొండ తో ఒక సినిమా చచేస్తున్నారట నిజమేనా.. అని అడగగా జాన్వీ మాట్లాడుతూ ” ఊహాగానాలు నమ్మవద్దు. నేను ఇంకా ఏ తెలుగు లేదా తమిళ చిత్రానికి సైన్ చేయలేదు. నేను ఒక సంతకం చేస్తే.. నేను కానీ నా ప్రొడక్షన్ హౌస్ కానీ దానిని ధృవీకరిస్తాం” అని చెప్పుకొచ్చింది. దీంతో ఈ సినిమాలో జాన్వీ నటించబోయేది లేదని అర్ధమయ్యింది. అవన్నీ పుకార్లు మాత్రమేనని, వీడీ సరసన అమ్మడు నటించడంలేదని క్లారిటీ వచ్చేసింది. జాన్వీ వెండితెరపై అడుగుపెట్టినప్పటినుంచి టాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడిస్తుంది.. ఎవరితో ఇస్తుంది? అన్న ప్రశ్నలకు ఇప్పటివరకు సమాధానం మాత్రం దొరకలేదు. మరి ముందు ముందు అమ్మడి టాలీవుడ్ ఎంట్రీ ఏ స్టార్ హీరోతో ఉండనుందో చూడాలి.