మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల సమయంలో బండ్ల గణేష్ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారిపోయింది.. ప్రకాష్ రాజ్ ప్యానల్ గుడ్‌బై చెప్పిన గణేష్.. ఆ ప్యానల్లో జనరల్ సెక్రటరీగా పోటీ చేస్తున్న జీవితను టార్గెట్ చేశారు.. ఆమెపైనే తాను స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేయనున్నట్టు ప్రకటించాడు.. ఇక, జీవిత రాజశేఖర్-చిరంజీవి ఫ్యామిలీ పాత గొడవలతో పాటు.. జీవిత పలు పార్టీలో మారంటూ కామెంట్లు చేశాడు బండ్ల గణేష్.. మా ఎన్నికల ఎపిసోడ్‌తో పాటు.. బండ్ల గణేష్ విమర్శలపై ఎన్టీవీ ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడిన జీవితా రాజశేఖర్.. గట్టిగానే కౌంటర్ ఎటాక్ చేశారు. నేను పార్టీల మారితే మీకు నష్టం ఎంటి? అని ప్రశ్నించిన జీవిత.. నా బతుకు గురించి నీకు ఎందుకు? నేను పార్టీలు మారితే మీకు వచ్చిన నష్టం ఏంటి? నేను రాజకీయ పార్టీలు మారితే బండ్ల గణేష్‌కు వచ్చిన కష్టమేంటి..? అంటూ ప్రశ్నించారు.. పార్టీలు మారడం అనేది నా ఇష్టం అని స్పష్టం చేశారు.. ఎన్టీవీ ఇంటర్వ్యూలో బండ్ల గణేష్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన జీవిత.. ఇంకా ఏం మాట్లాడారో తెలుసుకోవడానికి కింది వీడియోను క్లిక్ చేయండి..