గత యేడాది అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యారాయ్ అంతా కరోనా బారిన పడ్డారు. కానీ అదృష్టవశాత్తు జయా బచ్చన్ మాత్రం ఆ మహమ్మారి చేతికి చిక్కలేదు. అయితే ఇప్పుడు మాత్రం ఆమె కొవిడ్ 19 వైరస్ ను తప్పించుకోలేకపోయారు. తాజాగా జరిపిన పరీక్షలలో జయా బచ్చన్ కు కరోనా సోకినట్టు తేలింది. దాంతో ఆమె ప్రస్తుతం నటిస్తున్న ‘రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ’ చిత్రం షూటింగ్ ను కాన్సిల్ చేశారు.
Read Also : తలైవా కంటే ఎక్కువ ఫాలోయింగ్… సౌత్ లో అత్యధికంగా ఫాలో అవుతున్న స్టార్
కరన్ జోహార్ డైరెక్ట్ చేస్తున్న ఈ మల్టీ స్టారర్ మూవీలో రణవీర్ సింగ్, అలియాభట్ జంటగా నటిస్తుండగా ప్రీతిజింతా, ధర్మేద్ర, జయా బచ్చన్, షబానా ఆజ్మీ వంటి వారు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవల షబానా ఆజ్మీ సైతం కరోనా బారిన పడిన సంగతి తెలిసింది. ఇప్పుడు జయా బచ్చన్ కూ రావడంతో న్యూ ఢిల్లీలో ఫిబ్రవరి 2 నుండి 14 వరకూ ప్లాన్ చేసిన షెడ్యూల్ ను కాన్సిల్ చేశారు. సీనియర్ ఆర్టిస్టులు ఇద్దరికీ కరోనా వచ్చిన నేపథ్యంలో మిగిలిన నటీనటులు, సాంకేతిక నిపుణుల విషయంలో రిస్క్ తీసుకోవడం కరెక్ట్ కాదని కరన్ జోహార్ భావించాడట!