బాలీవుడ్ కా బాద్షా షారుఖ్ ఖాన్ జవాన్ సినిమా ప్రీవ్యూ సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. హిందీలో ఉన్న అన్ని డిజిటల్ రికార్డ్స్ ని బ్రేక్ చేస్తూ జవాన్ ప్రీవ్యూ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. నెగటివ్ ట్రెండ్, బాయ్ కాట్ ట్రెండ్ కూడా కనిపించకుండా పోయింది అంటే జవాన్ వీడియో ప్రేక్షకులని ఏ రేంజులో అట్రాక్ట్ చేస్తుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. 24 గంటల్లో 55 మిలియన్ వ్యూస్ కి పైగా రాబట్టిన జవాన్ ట్రైలర్ హిందీలో టాప్ ప్లేస్ లో ఉంది. ఈ విషయంలో షారుఖ్ ఫాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. అయితే కింగ్ ఖాన్ కూడా మా డైనోసర్ రికార్డులని బ్రేక్ చేయలేదు అంటూ ప్రభాస్ ఫాన్స్ హంగామా చేస్తున్నారు. జవాన్ సినిమా ట్రైలర్ వస్తుంది అన్నప్పటి నుంచి… సలార్ రికార్డులకు బ్రేక్ వేసేది జవాన్ మాత్రమే అనే మాట వినిపిస్తోంది. హిందీ చిత్ర పరిశ్రమ వర్గాలు కూడా ఈ విషయంలో కాన్ఫిడెంట్ గా ఉన్నాయి. థియేటర్ బిజినెస్, ఆడియో రైట్స్, ఓటీటీ రైట్స్, కలెక్షన్స్ ఇలా అన్ని విషయాల్లో జవాన్ vs సలార్ వార్ జరగబోతుందని బాలీవుడ్ వర్గాలు ఊహించాయి.
జవాన్, సలార్ సినిమాలు రెండు కూడా సెప్టెంబర్ నెలలోనే రిలీజ్ అవుతుండడంతో ఈ పోటీ మరింత పెరిగింది. మొదటి వార్ ట్రైలర్ రికార్డ్స్ నుంచే మొదలయ్యింది. ఈ వార్ లో 24 గంటల్లోనే 100 మిలియన్ వ్యూస్ రాబట్టి సలార్ టీజర్ టాప్ ప్లేస్ లో ఉంది. సలార్ టీజర్ వ్యూస్ కి దగ్గరలో కూడా జవాన్ ట్రైలర్ లేదు. దాదాపు 60-40 మార్జిన్ తో సలార్, జవాన్ ని బీట్ చేసింది. ఫ్యూచర్ లో జవాన్ సినిమా బాక్సాఫీస్ దగ్గర వెయ్యి కోట్లు రాబట్టనా కూడా సలార్ అంతకన్నా ఎక్కువ రాబట్టడం గ్యారెంటీ ఎందుకంటే ప్రభాస్ లో సౌత్ మార్కెట్ విపరీతంగా యాడెడ్ అస్సెట్ అవుతుంది. సౌత్ మార్కెట్ లో ప్రభాస్ అండ్ షారుఖ్ మధ్య ఉన్న డిఫెరెన్స్ జవాన్-సలార్ కలెక్షన్స్ లో తప్పకుండా కనిపిస్తుంది. అయినా అక్కడ డైనోసర్ ఉంటే కింగ్ కాంగ్ వచ్చినా కింగ్ ఖాన్ వచ్చినా ఆపడం సాధ్యపడే విషయమేనా?