Japan: కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ, అను ఇమ్మాన్యుయేల్ జంటగా జోకర్ ఫేమ్ రాజు మురుగన్ దర్శకత్వం వహించిన చిత్రం జపాన్. ఈ హైస్ట్ థ్రిల్లర్ ని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎస్ ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ ఆర్ ప్రభు నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర టీజర్, ట్రైలర్, పాటలకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. అన్నపూర్ణ స్టూడియోస్ ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తోంది. జపాన్ దీపావళి కానుకగా నవంబర్ 10 గ్రాండ్ గా థియేటర్స్ లో విడుదల కానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా టచింగ్ టచింగ్ సాంగ్.. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.
Trivikram: గుంటూరు కారం లో ఎన్టీఆర్.. గురూజీ సినిమాటిక్ యూనివర్స్..?
ఇక టచింగ్.. టచింగ్ వీడియో సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇక ఈ సాంగ్ ను కార్తీ పాడడం విశేషం. ఇక ఇందులో కార్తీ, అను రొమాన్స్ అదిరిపోయింది. ప్రస్తుతం యూట్యూబ్ లో ఈ సాంగ్ షేక్ చేస్తోంది. జపాన్ లో కార్తీ లుక్ నెక్స్ట్ లెవెల్ లో ఉందని చెప్పాలి. ఈ చిత్రంలో కార్తీ కరుడుగట్టిన దొంగగా కనిపించనున్నాడు. ఇక ఈ శుక్రవారం రిలీజ్ అయ్యే సినిమాలు అన్ని డబ్బింగ్ సినిమాలే. అందులో కొద్దోగొప్పో హైప్ తెచ్చుకున్న సినిమా అంటే జపాన్ అనే చెప్పాలి. దీంతో ఫ్యాన్స్ అందరూ.. జపాన్ పై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. మరి ఈ సినిమాతో కార్తీ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.