Trivikram: ఒకప్పుడు సినిమాలకు సీక్వెల్స్ రావడం చాలా అరుదు. ఇక ఇప్పుడు సీక్వెల్ లేకుండా ఒక సినిమా కూడా రావడం లేదు. ఇక ఈ మధ్య సినిమాటిక్ యూనివర్స్ లు ఎక్కువ అవుతున్నాయి. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్.. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్.. బాగా పేరు తెచ్చుకున్నారు. సినిమాటిక్ యూనివర్స్ అంటే.. వారు తీసిన ఒక సినిమా నుంచి మరో సినిమాకు లింక్ చేసి దాన్ని నుంచి మరో సినిమాకు లింక్ చేయడం అన్నమాట. ప్రస్తుతం ఇదే ట్రెండ్ నడుస్తోంది. ఇక ఒక సినిమాలో ఒక స్టార్ హీరో ఉంటే.. మరో సినిమాలో మరో స్టార్ హీరోతో కలిసి మల్టీస్టారర్ గా మారుస్తున్నారు. ఇక తాజాగా త్రివిక్రమ్ కూడా సినిమాటిక్ యూనివర్స్ మొదలుపెట్టినట్లు అభిమానులు చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం త్రివిక్రమ్.. గుంటూరు కారం సినిమాతో బిజీగా ఉన్నాడు.
Junaid Khan: హిజ్రాగా మారుతున్న స్టార్ హీరో కొడుకు..?
మహేష్ బాబు, శ్రీలీల జంటగా తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ అవుతుంది. ఇక ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక నిన్న త్రివిక్రమ్ పుట్టినరోజు సందర్భంగా మొదటి సాంగ్ ను రిలీజ్ చేసారు. ఇక ఈ సాంగ్ లో మహేష్.. కారు మీద రాజకీయ పార్టీ గుర్తు ఉంది. ఆ గుర్తు.. అరవింద సమేత చిత్రంలో కూడా ఉండడంతో త్రివిక్రమ్ సినిమాటిక్ యూనివర్స్ మొదలుపెట్టినట్లు అభిమానులు చెప్పుకొస్తున్నారు. ఇక అదే కనుక నిజమైతే గుంటూరు కారం చిత్రంలో ఎన్టీఆర్ ఉంటే ఓ రేంజ్ లో ఉంటుందని అభిమానులు ఆశపడుతున్నారు. మరి ఇందులో ఎంత నిజం ఉందో చూడాలి.