Janhvi Kapoor Says Her Pics Uploaded in Adult Sites at the age of 13: అతిలోక సుందరిగా తెలుగు ప్రేక్షకులందరికీ గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ ఇప్పుడు హీరోయిన్ గా వరుస సినిమాలు చేస్తోంది. ఒకప్పుడు కేవలం బాలీవుడ్ కే పరిమితమైన ఆమె ఇప్పుడు మాత్రం తెలుగులో స్టార్ హీరోల సరసన నటిస్తోంది. ఒకపక్క ఎన్టీఆర్ తో దేవర అనే సినిమా చేస్తూనే మరోపక్క బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా చేస్తున్న సినిమాలో కూడా హీరోయిన్గా ఎంపికైంది. అయితే ఒకపక్క సౌత్ సినిమాలు చేస్తున్న మరొక నార్త్ సినిమాల విషయంలో కూడా ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. తాజాగా ఈ భామ రాజ్ కుమార్ రావుతో కలిసి మిస్టర్ అండ్ మిసెస్ మహి అనే సినిమాలో నటించింది .ఈ సినిమా ఈ నెలాఖరున రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ లో పాల్గొంటుంది. సినిమా యూనిట్ ఈ ప్రమోషన్స్ లో భాగంగా జాన్వి కొన్ని విషయాలు బయటపెట్టింది.
Eesha Rebba: పాస్ట్ రిలేషన్స్, బ్రేకప్స్ గురించి ఈషా రెబ్బా షాకింగ్ కామెంట్స్.. ఆ పేరు వింటేనే భయం!
తనకు 13 ఏళ్ల వయసులోనే తన ఫోటోలను మార్ఫ్ చేసి పోర్న్ సైట్ లో పెట్టి దుష్ప్రచారం చేసినట్లు ఆమె వెల్లడించింది. కొందరు నా ఫోటోలను పోర్న్ సైట్లో శ్రీదేవి కూతురు ఎలా ఉందో చూశారా అంటూ అసభ్యంగా వైరల్ చేశారు. ఆ ఫోటోలు నా ఫ్రెండ్స్ కూడా చూశారు, ఆ సమయంలో స్కూల్ కి వెళ్ళినప్పుడు అవహేళన చేసేవారు. ఆ వయసులో అసలు ఏం జరుగుతుందో కూడా నాకు అవగాహన ఉండేది కాదు. నన్ను ఎందుకు ట్రోల్ చేస్తున్నారో కూడా అర్థమయ్యేది కాదని ఆమె కామెంట్ చేసింది. అంతేకాదు నన్ను బాడీ షేమింగ్ కి కూడా గురి చేశారు. ఆ విమర్శలు, ట్రోలింగ్ తట్టుకొని అన్నీ అవగాహన చేసుకుని ఇప్పుడు మరింత స్ట్రాంగ్ అయ్యాను. ఇప్పుడు ఎలాంటి విమర్శలు ఎదురైనా ట్రోలింగ్ జరిగినా నేను తట్టుకోగలను, అయితే నా విషయంలో ఎంత ట్రోల్ చేసినా ఇబ్బంది లేదు కానీ నా కుటుంబ సభ్యులను ట్రోల్ చేస్తే మాత్రం తట్టుకోలేను, అదే నా వీక్నెస్ అంటూ ఆమె కామెంట్ చేసింది.