Jananayagan Censor : జననాయగన్ కు సెన్సార్ షాక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ ‘జననాయగన్‘ రిలీజ్ చుట్టూ ఇండస్ట్రీలో సరికొత్త చర్చ నడుస్తోంది. గత 7 నెలలుగా ఈ చిత్రం సెన్సార్ వివాదాలు, కోర్టు కేసుల కారణంగా వాయిదా పడుతూ వస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం సెన్సార్ బోర్డు నుండి ‘A’ (అడల్ట్) సర్టిఫికెట్ పొందే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వచ్చే వారం రోజుల్లోగా ఈ తుది సర్టిఫికేషన్ ప్రక్రియ పూర్తి కానుందని ఆ వెంటనే హిందీ, తెలుగు వెర్షన్ల సెన్సార్ ఫార్మాలిటీస్‌ను కూడా పూర్తి చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.
సెన్సార్ సమస్యలు వీడుతుండటంతో మేకర్స్ ఈ సినిమాను జూలై 16 లేదా జూలై 23న థియేటర్లలోకి తీసుకురావాలని భావిస్తున్నట్లు సమాచారం. అయితే, ఇప్పటికే ఈ విండోలో పలు క్రేజీ చిత్రాలు తమ విడుదల తేదీలను ప్రకటించాయి. జూలై 17న ‘అన్బే డయానా’, జూలై 23న ‘మకుటం’, ‘ఇమ్మోర్టల్’, అలాగే జూలై 31న ‘డిసి’, ‘సిగ్మా’ వంటి చిత్రాలు లైన్లో ఉన్నాయి. ఇప్పుడు ఒకవేళ దళపతి విజయ్ రేసులోకి వస్తే ఇప్పటికే ప్రమోషన్లు మొదలుపెట్టిన ఆయా చిత్రాల కలెక్షన్లపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. అయితే సెన్సార్ A సర్టిఫికెట్ ఇస్తే చిన్న పిల్లలు ఈ సినిమా చూసేందుకు అనుమతించరు. తమ హీరో సినిమాను కావాలనే ఇబ్బందులు పెడుతున్నారని ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కానీ దళపతి చివరి చిత్రం కావడంతో ఈ సినిమా ఎప్పుడు వచ్చినా థియేటర్ల వద్ద జాతర ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
Also Read
- JoJo : 'జోజో' ఫస్ట్ లుక్.. 'మనోభావాల బ్యాచ్'కి స్వీట్ వార్నింగ్
- #PrabhasDP : 7 ఏళ్ల తర్వాత డీపీ మార్చిన రెబల్ స్టార్ ప్రభాస్.. సోషల్ మీడియా షేక్..షేక్
- Viswanath and Sons Review: విశ్వనాథ్ అండ్ సన్స్ రివ్యూ.!
- Sankranti Box Office Clash : అందరికీ సంక్రాంతే కావాలి.. సినిమా పట్టాలెక్కకముందే పండగ రేసుపై కర్చీఫ్
తాజావార్తలు
-
Moto G Max: భారత్ లో మోటో జి మ్యాక్స్ విడుదల.. స్నాప్‌డ్రాగన్ 6s జెన్ 4 చిప్, 7,000mAh బ్యాటరీ.. ధర, ఫీచర్స్ ఇవే
-
Sumith Fernando Dies: టీమిండియాతో మొదటి టెస్ట్ ముందు.. శ్రీలంక క్రికెట్లో పెను విషాదం!
-
JoJo : ‘జోజో’ ఫస్ట్ లుక్.. ‘మనోభావాల బ్యాచ్’కి స్వీట్ వార్నింగ్
-
Indoor Plants: ఒక్క గ్లాస్ నీటితో ఇంట్లో గ్రీన్ డెకరేషన్.. ఈ మొక్కలను ఇలా పెంచండి!
-
AP Dwakra Women: డ్వాక్రా మహిళలకు గుడ్‌న్యూస్.. రూ.3 లక్షల రుణం, సబ్సిడీ కూడా!
ట్రెండింగ్
-
Termite-Proof Furniture: చెదల బెడదకు చెక్.. చెక్కకు బదులుగా ఈ మెటీరియల్స్ ఎంచుకోండంతే.!
-
Hardik Pandya Trade: చెన్నై, కోల్‌కతా కాదు.. హార్దిక్ ఆ జట్టులోకే వెళ్తాడు.. ఏ తప్పేముంది!
-
IND vs SL 1st Test: తుది జట్టులో చోటు ఉండదు.. స్టార్ బ్యాటర్‌కు హెడ్ కోచ్ గంభీర్ వార్నింగ్!
-
BSNL బంపర్ ఆఫర్.. 365 రోజులకు బదులుగా 412 రోజుల వ్యాలిడిటీ.! రోజుకు 2GB హై-స్పీడ్ డేటా కూడా..
-
IND vs SL: గిల్, రాహుల్, పంత్ కాదు.. అతడే సబ్ కాంటినెంట్‌కు కింగ్.. మొదటి టెస్టులో ఆడించాలి!