Bro First Single: ‘బ్రో’.. మార్కండేయ వస్తున్నాడట.. రెడీనా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BroFirstSingle: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా హీరో సాయి ధరమ్ తేజ్ మల్టీస్టారర్ గా తెరకెక్కిన చిత్రం బ్రో. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ సముతిరఖని దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి త్రివిక్రమ్ మాటలు అందించగా .. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక జూలై 28 న ఈ సినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలోనే ప్రమోషన్ల జోరును పెంచేశారు మేకర్స్. ప్రమోషన్స్ లో భాగంగా ఈ సినిమా నుంచి మొదటి సాంగ్ ను రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. ” మై డియర్ మార్కండేయ ” అంటూ సాగే సాంగ్ ను రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు. అయితే సమయం మాత్రం చెప్పలేదు. త్వరలోనే అంటూ ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. ఇందులో మార్కండేయ అలియాస్ మార్క్ గా సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న విషయం తెల్సిందే. ఇక అతని క్యారెక్టర్ ను రివీల్ చేసే పాటలా కనిపిస్తుంది. ఈ సాంగ్ కేవలం తేజ్ మీదనే చిత్రీకరించారని టాక్. ఈ చిత్రంలో తేజ్ సరసన కేతిక శర్మ కనిపిస్తోంది. కాగా , ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు.
Manchu Lakshmi: నిహారికకు ఏం తక్కువ.. వారి కెరీర్ ను పాడుచేస్తున్నారు
Also Read
- Kayadu Lohar: ‘ది ప్యారడైజ్’లో కాయదు విలనా.. హీరోయినా? నాని మైండ్ బ్లాంక్ రియాక్షన్!
- The Paradise : ‘ది ప్యారడైజ్’ సీక్రెట్స్ లీక్ చేసిన సంపూర్ణేష్ బాబు! నాని జడల వెనుక అసలు కథ ఇదేనట..
- Sampoornesh Babu: స్టార్డమ్ ముసుగు తీసేసిన సంపూ.. తెరవెనుక అసలైన జీవితం ఇదేనట!
- Viswanath & Sons : నెట్‌ఫ్లిక్స్‌ను ఊపేస్తున్న సూర్య సినిమా.. ఇండియాలో నెం.1.. గ్లోబల్‌గా టాప్-3!
రీమేక్ సినిమా అయినా.. బ్రో మీద అభిమానులు భారీగానే అంచనాలు పెట్టుకున్నారు. టీజర్ తో సినిమాపై అంచనాలు పెట్టుకోవచ్చని ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు. ఇందులో పవన్ దేవుడిగా కనిపిస్తుండగా.. తేజ్ సాఫ్ట్ వేర్ గా కనిపించనున్నాడు. మరి ఈ సాంగ్ ను మేకర్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారో చూడాలి. నిజం చెప్పాలంటే.. సినిమా రిలీజ్ కావడానికి చాలా తక్కువ సమయం ఉంది.. ప్రమోషన్స్ ఇంకా స్లోగా ఉన్నాయి. ఈ సాంగ్ తో ప్రమోషన్స్ మొదలుపెట్టి.. వరుస ప్రమోషన్స్ చేస్తే సినిమాపై ఇంకా హైప్ క్రియేట్ అవుతుందని అభిమానులు చెప్పుకొస్తున్నారు, ఎలాగూ పవన్ ప్రమోషన్స్ కు రాడు .. మిగిలినవారైనా ఇంటర్వ్యూలు, ప్రెస్ మీట్లు లేకపోతే సరికొత్త ప్రమోషన్స్ మొదలుపెడితే బావుంటుందని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మరి మేకర్స్ ఏ రేంజ్ లో ప్రమోషన్స్ మొదలుపెడతారో చూడాలి.
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..