Jailer Telugu States Collections: రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్లో తెరకెక్కిన జైలర్ సినిమా తెలుగు తమిళ భాషల్లో గురువారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమాకి మొదటి ఆట నుంచి హిట్ టాక్ లభించడంతో కలెక్షన్ల వర్షం కురుస్తోంది. అటు తమిళ వర్షన్ కి భారీ ఎత్తున కలెక్షన్లు వస్తుండగా తెలుగులో కూడా సినిమాకి మంచి వసూళ్లు వస్తున్నాయి. జైలర్ సినిమా మొదటి రోజు తెలుగు ప్రాంతాలవారీగా వసూళ్లు ఎంత వచ్చాయి అనేది పరిశీలిద్దాం. నైజాం ప్రాంతంలో మూడు కోట్ల 21 లక్షలు, సీడెడ్ ప్రాంతంలో 94 లక్షలు, ఉత్తరాంధ్ర 81 లక్షలు, ఈస్ట్ గోదావరి 40 లక్షలు, వెస్ట్ గోదావరి 33 లక్షలు, గుంటూరు 65 లక్షలు, కృష్ణ 45 లక్షలు, నెల్లూరు 22 లక్షల మొత్తం కలిపి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏడు కోట్ల 1 లక్ష షేర్ లభించగా 12 కోట్ల వరకు గ్రాస్ వసూలు చేసినట్లు తెలుస్తోంది.
Bhola Shankar Review: భోళాశంకర్ రివ్యూ
ఒకరకంగా ఈ మధ్యకాలంలో వచ్చిన తమిళ సినిమాలతో పోలిస్తే జైలర్ సినిమా మొదటిరోజు భారీ ఎత్తున వసూళ్లు తెలుగులో రాబట్టినట్లయింది. పొన్నియన్ సెల్వన్ మొదటి భాగం రెండు కోట్ల 88 కోట్లు మొదటి రోజు వసూలు చేస్తే ఈ సినిమా ఏకంగా ఏడు కోట్ల వరకు వసూలు చేసింది. బీస్ట్, వారసుడు, సార్, లవ్ టుడే, సర్దార్ వంటి సినిమాల కంటే రజనీకాంత్ జైలర్ సినిమా భారీ ఎత్తున వసూళ్లు రాబట్టింది. రజనీకాంత్ రీసెంట్ సినిమాల విషయానికొస్తే పెద్దన్న సినిమా కోటి 60 లక్షలకే పరిమితం కాగా ఇంతకు ముందు వచ్చిన దర్బార్ నాలుగు కోట్ల 52 లక్షలు వసూలు చేసింది. అయితే లింగా సినిమా నుంచి చూసుకుంటే ఒక్క 2.0 సినిమాకి మాత్రమే 12:30 కోట్లు వచ్చాయి. ఆ తర్వాత భారీ ఎత్తున వసూలు చేసిన సినిమా అయితే జైలర్ అనే చెప్పాలి.