Manchu Manoj: ఏందీ బ్రో.. ‘వాట్ ది ఫిష్’.. అర్ధం కానట్లే ఉంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Manchu Manoj: మంచు మనోజ్.. ఈ మధ్యనే తాను ప్రేమించిన భూమా మౌనికను రెండో వివాహం చేసుకొని సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టాడు. వ్యక్తిగతంగానే కాకుండా కెరీర్ లో కూడా సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టాడు. అప్పుడెప్పుడో ఒక్కడు మిగిలాడు అనే సినిమాతో వెండితెరపై కనిపించిన మనోజ్ ఇప్పటివరకు మళ్లీ కనిపించింది లేదు. ఇక ఇప్పుడు తాం ఫోకస్ అంతా సినిమాపైనే అంటూ దూసుకొచ్చేస్తున్నాడు. ప్రస్తుతం మనోజ్ నటిస్తున్న కొత్త చిత్రం ‘వాట్ ది ఫిష్’. వరుణ్ కోరుకొండ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని విశాల్ బెజవాడ – సూర్య బెజవాడనిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన ప్రీ లుక్.. టైటిల్ లుక్ ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా ఆసక్తిని కూడా రేకెత్తించింది. ఇక నేడు మంచు మనోజ్ పుట్టినరోజు కావడంతో ఈ సినిమా ఫస్ట్ లుక్ గ్లింప్స్ ను రిలీజ్ చేసి మనోజ్ కు బర్త్ డే విషెస్ తెలిపారు.
Manoj Bajpayee: రామ్ గోపాల్ వర్మ నన్ను మోసం చేశాడు.. ‘ది ఫ్యామిలీ మ్యాన్ హీరో’ సంచలన వ్యాఖ్యలు
Also Read
- Sambaraala Yetigattu Glimpse: మెగా హీరో.. 'సంబరాల ఏటిగట్టు' గ్లింప్స్ మామూలుగా లేదుగా!
- Rahul Sankrityan: ఆ ఆవేశం నుంచే ‘రణబాలి’ పుట్టింది: రాహుల్ సాంకృత్యన్
- Vijay Deverakonda: 'ఏం పనిరా మీ తెల్లొళ్లకి ఈడ'.. బ్రిటీషర్లపై సీమ యాసలో రౌడీ విశ్వరూపం!
- Ranabali Trailer: తెల్లదొరల గుండెల్లో సింగనమల బొబ్బిలి నిప్పులు.. గూస్బంప్స్ తెప్పిస్తున్న 'రణబాలి' ట్రైలర్!
ఫస్ట్ గ్లింప్స్ చాలా క్రేజీగా కనిపిస్తుంది. మనోజ్ రకారకాల పాత్రలో కనిపిస్తున్నాడు. రోబోలా.. ఉద్యోగిలా. డీజేలా..ఇలా క్యారెక్టర్స్ మారుతూ చివరికి ఒకే వ్యక్తి.. రెండు స్వభావాలుగా చూపించి షాక్ ఇచ్చారు. మనోజ్ సైతం ఒకపోస్టర్ లో కళ్ళజోడు పెట్టుకొని కనిపించగా.. ఇంకొక పోస్టర్ లో కళ్ళజోడు లేకుండా కనిపించాడు. భయానికి కొత్త రూపం అంటూ శక్తికాంత్ కార్తీక్ సంగీతం ఆకట్టుకుంటుంది. అయితే ఈ సినిమా కాన్సెప్ట్ ఏంటి అనేది మాత్రం అర్ధం కావడం లేదని అభిమానులు చెప్పుకొస్తున్నారు. అసలు వాట్ ది ఫిష్ అనే టైటిల్ ను ఎందుకు పెట్టారో తెలియనే తెలియదు.. ఇప్పుడు కాన్సెప్ట్ వీడియో కూడా అర్ధం కాకుండాఉంది.. మనోజ్ అన్నా ఏం కొత్త ప్రయోగం చేస్తున్నావ్ అంటూ అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు. మరి ఈ సినిమాతోనైనా మనోజ్ హిట్ అందుకొని ట్రాక్ ఎక్కుతాడో లేదో చూడాలి.
తాజావార్తలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
-
OTR: నారాయణ్ ఖేడ్లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
-
OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
-
OTR: నెలకు ₹2,000 కోట్లు! చంద్రబాబు మాస్టర్ ప్లాన్ ఇదేనా?
-
US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!