Jagapathi Babu: టాలీవుడ్ విలక్షణ నటుడు జగపతిబాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ అని తేడా లేకుండా వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు జగ్గూభాయ్. ఇక ఆయన కీలక పాత్రలో నటించిన రామబాణం రిలీజ్ కు సిద్దమవుతుంది. గోపీచంద్, డింపుల్ హయతి జంటగా శ్రీవాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మే 5 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో జగ్గూభాయ్, గోపీచంద్ కు అన్నగా నటిస్తున్నాడు. ఇక ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్ల వేగాన్ని షురూ చేసిన చిత్ర బృందం వరుస ఇంటర్వ్యూలతో బిజీగా మారింది. ఈ నేపథ్యంలోనే జగ్గూభాయ్ వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ.. సినిమాకు సంబంధించిన విషయాలనే కాకుండా తన వ్యక్తిగత అభిప్రాయాలను కూడా పంచుకున్నారు.
VD 12: విజయ్ దేవరకొండ కొత్త సినిమా పూజావేడుక..
ఇకపోతే జగ్గూభాయ్ మనస్తత్వం గురించి అందరికి తెల్సిందే. మనసులో ఏది అనుకుంటాడో అది నిర్మొహమాటంగా బయటికి చెప్పేస్తాడు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో.. జగ్గూభాయ్ ఎదుట రజినీకాంత్ కాంట్రవర్సీ ప్రశ్న ఎదురయ్యింది. ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకు గెస్ట్ గా వచ్చిన రజినీ.. ఎన్టీఆర్ గురించి, చంద్రబాబు గురించి మాట్లాడాడు. చంద్రబాబు లో ఒక విజన్ ఉందని, ఆయన ఉన్నప్పుడు హైదరాబాద్ కు వస్తే న్యూయార్క్ కు వచ్చినట్లు ఉందని చెప్పుకొచ్చాడు. ఇక ఈ వ్యాఖ్యలపై వైసీపీ నాయకులు దుమ్మెత్తిపోశారు. రజినీకాంత్ ను అసభ్యపదజాలంతో తిట్టిపోశారు. ఇక ఆ విషయమై జగ్గూభాయ్ ను ప్రశ్నించగా.. ” రజినీకాంత్ 100 శాతం రైట్. ఇది అనలేదు.. కానీ ఆయన మాట్లాడే విధానం, ఆయన అనే మాటలు పర్ఫెక్ట్ గా ఉంటాయి. చక్కగా మాట్లాడతాడు.. పర్ఫెక్ట్ గా మాట్లాడతాడు.. నిజాలు మాట్లాడతాడు” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.