Jaquelin Fernandez : సినీ సెలబ్రిటీలు చాలా మందికి సాయం చేస్తూనే ఉంటారు. తాజాగా ఓ స్టార్ హీరోయిన్ ఇలాంటి సాయమే ప్రకటించి అందరి మనసులు దోచుకుంది. ఆమె ఎవరో కాదు బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్. గతంలో కాంట్రవర్సీల్లో చిక్కుకున్న ఈమె.. ఇప్పుడు వరుసగా ఐటెం సాంగ్స్, సినిమాల్లో హీరోయిన్ గా చేస్తూ దూసుకుపోతోంది. ఇలాంటి టైమ్ లో తన గొప్ప మనసు చాటుకుంది. ఓ పిల్లాడికి అరుదైన వ్యాధి సోకిందని తెలుసుకుని వెంటనే అతని ఇంటికి వెళ్లింది. ఆ బాబు తల భారీగా ఉబ్బిపోయింది ఉంది. ఈ వ్యాధిని హైడ్రోసెఫాలస్ అంటారు. ఈ వ్యాధి సోకిన వారి బెలూన్ లాగా పెద్దగా ఉంటుంది. దీనికి కచ్చితంగా సర్జరీ చేయాల్సిందే.
Read Also : Nayanthara : నయనతార రూ.5 కోట్లు ఇవ్వు.. మరో కాంట్రవర్సీ
తాజాగా బాలుడి వద్దకు వెళ్లిన జాక్వెలిన్.. తాను సర్జరీ చేయిస్తానని హామీ ఇచ్చింది. ఏర్పాట్లు చేసుకోవాలంటూ తెలిపింది. పైగా బాబుతో కాసేపు ఆడుకుంటూ కనిపించింది. బాబుకు పాల డబ్బాతో పాలు పట్టింది. దీంతో ఇందుకు సంబంధించిన విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జాక్వెలిన్ ను అందరూ అభనందిస్తున్నారు. జాక్వెలిన్ కు ఓ స్వచ్ఛంద సంస్థ ఉంది. దాని ద్వారా ఇలాంటి వారికి సాయం చేస్తోంది. గతంలోనూ కొందరికి ఆపరేషన్లు చేయించింది. ప్రస్తుతం ఈ బ్యూటీ రెండు సినిమాల్లో ఫుల్ బిజీగా ఉంది.
Read Also : Bigg Boss 9 : బిగ్ బాస్-9 లో మరో లవ్ ట్రాక్.. ఏం జరుగుతోంది..?