Jabardasth Naresh about His Love Intrest in latest Show : అత్యధిక ఆదరణ పొందుతున్న షోల్లో జబర్దస్త్ ఒకటి. ఇక ఈ షో ఎంతో మందికి లైఫ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే మామూలుగా ఈ వేదికపై ఎన్నో స్కిట్స్, లవ్ ట్రాక్ లు నడిచాయి. ముఖ్యంగా సుధీర్, రష్మి లవ్ ట్రాక్ వర్కౌట్ అవ్వడంతో.. చాలా మంది కమెడియన్స్ లవ్ ట్రాక్ లు నడిపారు. ఇక ఇటీవల జబర్దస్త్ నరేష్.. తనకు ఓ లవర్ ఉందంటూ స్టేజ్ మీద ఓ అమ్మాయిని ఇంట్రడ్యూస్ చేశాడు. తాను ఆ అమ్మాయి.. రెండేళ్లుగా ప్రేమించుకున్నట్లు చెప్పుకువచ్చాడు. ఆ ప్రోమో వీడియో కూడా నెట్టింట వైరల్ అయింది. ఇక ఇదంతా చూసిన నెటిజన్స్, ప్రేక్షకులు కూడా నరేష్ కు కూడా లవర్ ఉందా అంటూ నోరేళ్ల బెట్టారు. ఇక తాజాగా జబర్దస్త్ ఎపిసోడ్ టెలికాస్ట్ అయింది. అది చూసిన ప్రేక్షకులు అంతా బకరా అయినట్లు తెలుస్తోంది. నరేష్ ఆ అమ్మాయితో ఇన్ స్టాగ్రామ్ లో పరిచయం కావడం.. ఆ తర్వాత నంబర్లు మార్చుకోవడం.. ప్రేమించుకోవడం జరిగందని చెప్పుకువచ్చాడు.
Jamal Kudu: సోషల్ మీడియాను ఒక ఊపు ఊపిన జమాల్ కుడు సాంగ్ ఎక్కడిదో తెలుసా?
ఆ అమ్మాయి కూడా నరేష్ ప్రేమ చాలా గొప్పదని, ఎంతో బాగా చూసుకున్నాడని చెప్పుకువచ్చింది. స్టేజ్ పైనే లవ్ ప్రపోజ్ చేసుకోవడం.. హగ్గులు, కిస్సులు ఇచ్చేసుకున్నారు. ఇక త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు వెల్లడించారు. యాంకర్ రష్మి తోపాటు హైపర్ ఆది అక్కడున్న వారంతా ఇది చూసి షాక్ అయ్యారు. ఇదంతా బాగానే ఉండగా… చివరిలో నరేష్ షాక్ ఇచ్చాడు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షుకలను బకరా చేసేశాడు. ఇదంతా ప్రాంక్ అంటూ చెప్పుకువచ్చాడు. దీంతో యాంకర్ రష్మి గౌతమ్ తో సహా అందరూ షాక్ అయ్యారు. ఇదిలా ఉంటే.. చివరకు హైపర్ ఆది మరో ట్విస్టు ఇచ్చాడు. ఆ అమ్మాయిని నరేష్ ప్రేమించలేదని.. తాను ప్రేమిస్తున్నట్లు చెప్పి.. మైండ్ బ్లాక్ చేశాడు. ప్రస్తుతం ఈ ఎపిసోడ్ యూట్యూబ్ లో ట్రెండింగ్ గా మారింది.