Mimicry Murthi: చిత్ర పరిశ్రమలో విషాదం చోస్తుచేసుకొంది. బుల్లితెరపై జబర్దస్త్ షో తెలియని ప్రేక్షకుడు ఉండడు అంటే అతిశయోక్తి కాదు. ఆ షో ఎంతోమంది కళాకారులకు ఒక జీవితాన్ని ఇచ్చింది.. అలాంటి షోలో తనదైన మిమిక్రీతో, నటనతో మెప్పించిన మూర్తి అలియాస్ మిమిక్రీ మూర్తి కన్నుమూశారు. గత కొన్నేళ్లుగా ప్యాంక్రియాస్ క్యాన్సర్ అనే వ్యాధితో బాధపడుతున్నారు. ఈ వ్యాధి గురించి ఆయన పలుమార్లు చాలా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఇక ఇప్పటికే రూ. 16 లక్షలు ఖర్చుపెట్టారని, అయినా ప్రయోజనం లేకపోయిందని, చికిత్స పొందుతూనే ఆయన తన స్వస్థలమైన హనుమకొండలో కన్నుమూసినట్లు మూర్తి తమ్ముడు అరుణ్ తెలిపాడు. మూర్తి మరణ వార్తతో జబర్దస్త్ లో విషాదం నెలకొంది.
చలాకీ చంటి, వేణు, ధనరాజ్ టీమ్ లో నాటకాల రాయుడుగా ఆయన చేసిన స్కిట్స్ మంచి గుర్తింపు తెచ్చుకున్నాయి. ముఖ్యంగా ఉద్యావనంలో వ్రందగత్తెను నేను అంటూ పద్యం పాడి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఆరోగ్యం సహకరించక జబర్దస్త్ కూడా మానేసిన ఆయన ఇంటికే పరిమితమయ్యాడు. ఎంతోమందిని ఆర్థిక సాయం చేయమని అడిగినట్లు ఒక ఇంటర్వ్యూలో తెలిపిన ఆయన ఉన్న డబ్బునంత తన ట్రీట్మెంట్ కోసమే వెచ్చించినట్లు చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఆ ఓల్డ్ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇక మూర్తి భౌతిక కాయాన్ని చూడడానికి జబర్దస్త్ టీమ్ హనుమకొండకు బయల్దేరుతున్నట్లు సమాచారం. మూర్తి మరణ వార్త విన్న పలువురు ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా సంతాపం తెలుపుతున్నారు.