Site icon NTV Telugu

Vamsi Paidipally : పవన్‌కల్యాణ్‌తో అసలు వంశీ పైడిపల్లి సినిమా సాధ్యమేనా?

Pawann

Pawann

ఒక హిట్‌ సినిమా తీసిన తర్వాత కూడా.. దాదాపు మూడేళ్లుగా మెగాఫోన్‌ పట్టని దర్శకుడు టాలీవుడ్‌లో ఒకరు ఉన్నారు. ఈ విషయంలో ఆ దర్శకుడు రాజమౌళి కంటే కూడా ‘స్లో’ అని చెప్పవచ్చు. జక్కన్న కనీసం మూడేళ్లకో భారీ సినిమాతో ప్రేక్షకులను పలకరిస్తే, ఆ దర్శకుడు మాత్రం తన 17 ఏళ్ల కెరీర్‌లో తీసింది కేవలం ఆరు సినిమాలే. ఆయనే.. ప్రముఖ దర్శకుడు వంశీ పైడిపల్లి.

మహేష్ బాబుతో ‘మహర్షి’ వంటి నేషనల్ అవార్డు గెలుచుకున్న హిట్‌ను, ఆ తర్వాత విజయ్‌తో ‘వారిసు’ (తెలుగులో ‘వారసుడు’) వంటి పెద్ద సినిమాను తీసినా.. వంశీ పైడిపల్లి గత మూడు సంవత్సరాలుగా కొత్త ప్రాజెక్ట్‌ను ప్రకటించలేదు. ఈ గ్యాప్‌లో ఆయన హిందీ సినీ పరిశ్రమపై దృష్టి సారించినట్లు వార్తలు వచ్చాయి. అమీర్‌ఖాన్‌, సల్మాన్‌ఖాన్‌ వంటి బాలీవుడ్‌ అగ్ర హీరోలకు కథలు వినిపించేందుకు ఆయన ముంబై చుట్టూ తిరిగారని ప్రచారం జరిగింది. అయితే, ఆయన బాలీవుడ్ ప్రయత్నాలు అనుకున్నంతగా వర్కవుట్ కాలేదని, అందుకే తిరిగి టాలీవుడ్‌కు వచ్చారని ఇండస్ట్రీ టాక్.

Also Read :Vivek Oberoi : క్యాన్సర్ పిల్లల కోసం.. పారితోషికం విరాళంగా ఇచ్చిన బాలీవుడ్ స్టార్

ప్రస్తుతం వంశీ పైడిపల్లి పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్‌ కోసం ఓ కథ రాసుకుంటున్నట్లు, దిల్ రాజు నిర్మాణంలో ఈ సినిమా సెట్ అయ్యే అవకాశం ఉందని తాజా సమాచారం. పవన్‌కల్యాణ్‌కు ఈ కథ నచ్చి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారనే ప్రచారం జరుగుతోంది. అయితే ఇక్కడే పవన్ అభిమానుల్లో ఒక పెద్ద ప్రశ్న తలెత్తుతోంది.

పవన్‌కల్యాణ్‌ తన సినిమాల షూటింగ్‌ను వేగంగా, ముఖ్యంగా 40 రోజుల్లో తన పాత్రకు సంబంధించిన సన్నివేశాలను పూర్తి చేయాలని కోరుకుంటారు. కానీ, వంశీ పైడిపల్లి సినిమా పూర్తి చేయడానికి మినిమం 80 రోజులు తీసుకుంటారనే పేరుంది. ఈ ‘స్పీడ్’ తేడా కారణంగా, పవన్‌కల్యాణ్‌ వంటి బిజీ స్టార్‌ను వంశీ హ్యాండిల్ చేయగలరా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Also Read :Raviteja: యంగ్ హీరోతో మల్టీ స్టారర్ సెట్?

పవన్‌కల్యాణ్‌ ఇప్పటికే ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ షూటింగ్‌ను పూర్తి చేశారు. అయితే, ఆయన తదుపరి చిత్రం ఏంటి, ఎవరితో ఉంటుంది అనే విషయంలో ఇప్పటికీ స్పష్టత లేదు. ఇలాంటి సమయంలో, పవన్‌తో వంశీ పైడిపల్లి కాంబినేషన్ నిజమైతే, ఆ సినిమా ఎప్పుడు పూర్తవుతుందనేది ఆసక్తికరంగా మారింది. బాలీవుడ్ ప్రయత్నాలు సఫలం కాక టాలీవుడ్‌కు వచ్చిన వంశీకి.. పవన్‌కల్యాణ్‌తో ప్రాజెక్ట్ ఒక పెద్ద అవకాశంగా మారింది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Exit mobile version