Sankranthi Release : సంక్రాంతికి రావాల్సిన స్టార్ హీరో సినిమా వాయిదా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శివకార్తికేయన్ హీరోగా తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘పరాశక్తి’ (Parasakthi) పొంగల్ స్పెషల్‌గా జనవరి 10, 2026న థియేటర్లలో విడుదలకు సిద్ధమైంది. సుధా కొంగర దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం, తమిళనాడులో జరిగిన హిందీ వ్యతిరేక ఉద్యమానికి సంబంధించిన నిజ సంఘటనల ఆధారంగా తెరకెక్కింది. ఇటీవల రిలీజ్ చేసిన ట్రైలర్ కు భారీ రెస్పాన్స్ వచ్చింది.
Also Read : Tirumala : తిరుమల శ్రీవారి సన్నిధిలో టాలీవుడ్ హీరోయిన్స్
Also Read
- S Janaki: మన తెలుగు గర్వం ఎస్. జానకి.. గుంటూరు నుంచి భారత సంగీత గగనానికి ఎదిగిన గానకోకిల
- Nagarjuna: కొడుకు సక్సెస్ కోసం నాగార్జున తపన.. ‘లెనిన్’ స్క్రిప్ట్‌లో కింగ్ రైటింగ్!
- Akkineni Nagarjuna : అఖిల్‌కి హిట్ ఇవ్వమని శ్రీ వెంకటేశ్వర స్వామిని కోరుకున్నాను
- Double Occupancy OTT: పగలు అమ్మాయి.. రాత్రి అబ్బాయి.. ఓటీటీలోకి షాకింగ్ కాన్సెప్ట్ మూవీ
అయితే ఈ సినిమాను మొదట తమిళంతో పాటు తెలుగులో కూడా ఒకేసారి విడుదల చేస్తామని ప్రకటించారు. టీజర్, సాంగ్స్ కూడా తెలుగులో రిలీజ్ చేశారు. అమరన్ హిట్ తర్వాత వస్తున్న శివకార్తికేయన్ సినిమా కావడంతో తెలుగులోను ఈ సినిమాకు మంచి బజ్ ఉంది. అయితే తాజా సమాచారం ప్రకారం, తెలుగు డబ్బింగ్ వెర్షన్ విడుదల పడే అవకాశం కనిపిస్తోంది. తెలుగులో మన శంకరవరప్రసాద్, రాజాసాబ్, భర్త మహాశయులకు విజ్ఞప్తి, నారి నారి నడుమ మురారి వంటి సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. థియేటర్స్ లో ఈ సినిమాలకు కేటాయించబోతున్నారు. దానికి తోడు విజయ్ జననాయగాన్ ను తెలుగులో PVRINOX రిలీజ్ చేస్తుంది. సో మల్టీప్లెక్స్ లో ఎక్కువ షోస్ విజయ్ సినిమాకు వెళ్తున్నాయి. దాంతో అటు సింగిల్ స్క్రీన్స్, ఇటు మల్టిప్లెక్స్ లో పరాశక్తికి థియేటర్స్ దొరకడంలేదు. ఈ కారణాంగా తమిళ వెర్షన్‌ను జనవరి 10న విడుదల చేసిన తర్వాత తెలుగు వెర్షన్‌ను జనవరి 23న రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. గతంలో తన సినిమాలకు తెలుగులో ప్రమోషన్స్ చేసిన హీరో కార్తికేయన్ పరాశక్తి విషయంలో టాలీవుడ్ కు దూరంగానే ఉంటున్నాడు. పరిస్థితి చూస్తుంటే పరాశక్తి తెలుగు రిలీజ్ దాదాపు లేనట్టేనని తెలుస్తోంది.
తాజావార్తలు
-
Bankra mosque: కోల్‌కతా ఎయిర్‌పోర్టు పక్కన 136 ఏళ్ల మసీదు తరలింపు..
-
VBSA Bill: పార్లమెంట్‌లోకి ‘వీబీఎస్ఏ బిల్లు’.. ఎన్డీఏ రాష్ట్రాల సహా తీవ్ర వ్యతిరేకత.. కారణమిదేనా?
-
S Janaki: మన తెలుగు గర్వం ఎస్. జానకి.. గుంటూరు నుంచి భారత సంగీత గగనానికి ఎదిగిన గానకోకిల
-
S Janaki: “ప్రశాంతంగా అనంత లోకాలకు వెళ్లిపోయారు..” ఎస్. జానకి మృతిపై మనవరాలు ఎమోషనల్!
-
S Janaki : ఎస్. జానకి మృతి.. సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం
ట్రెండింగ్
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్‌లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్‌తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!