SSMB29 : మహేష్,రాజమౌళి మూవీ షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు రీసెంట్ గా “గుంటూరు కారం” సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన ఈ మూవీ సూపర్ హిట్ అయింది .దీనితో మహేష్ తరువాత సినిమాపై ప్రేక్షకులలో ఆసక్తి పెరిగింది .మహేష్ తన తరువాత సినిమా దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో చేస్తున్నాడు..ఈ సినిమా మహేష్ బాబు 29 వ సినిమాగా తెరకెక్కుతుంది.అయితే మహేష్ , రాజమౌళి సినిమాపై వస్తున్న అప్‌డేట్‌లు సినిమాపై మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.ఇప్పటికే ఈ సినిమా ఎలా ఉందబోతుందో కథా రచయిత అయిన విజయేంద్రప్రసాద్ పలు హింట్స్ అందించారు. రాజమౌళి,నేను దక్షిణాఫ్రికా నవలా రచయిత అయిన విల్బర్ స్మిత్‌కు బిగ్ ఫ్యాన్స్ అని ఆయన తెలిపారు. ఆయన రచించిన పుస్తకాల ఆధారంగానే ఈ మూవీ స్క్రిప్ట్‌ని రాసినట్లుగా ఆయన ఓ వేదికపై తెలిపారు.హనుమంతుడిని పోలిన లక్షణాలతో ఇందులో మహేశ్ పాత్రను రాజమౌళి డిజైన్ చేసినట్టు సమాచారం.
ఇదిలా వుంటే ఈ సినిమాలో మహేష్ బాబుకు జోడిగా ఓ విదేశీభామ నటిస్తున్నట్లు సమాచారం .అలాగే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో అలియాభట్ కూడా నటిస్తున్నట్లు తెలుస్తుంది.అయితే ఈ సినిమాకు సంబంధించి తొలి ప్రెస్ మీట్ ని సూపర్‌స్టార్ కృష్ణ పుట్టినరోజైన మే 31న నిర్వహించనున్నట్టు గతంలో తెగ వార్తలు వచ్చాయి.అలాగే మహేశ్ పుట్టినరోజైన ఆగస్ట్ 9న పూజా కార్యక్రమంతో ఈ సినిమా షూటింగ్ ను మొదలు పెట్టాలని రాజమౌళి భావిస్తున్నట్లు సమాచారం.రాజమౌళి ఈ సినిమాను తనదైన మార్క్ యాక్షన్ సీక్వెన్స్ లతో అద్భుతంగా తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాకు ఆస్కార్ విన్నర్ ఎం.ఎం.కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు. కె.ఎల్.నారాయణ ఈ బిగ్గెస్ట్ పాన్ వరల్డ్ సినిమాను ఎంతో గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది.
Also Read
- Mouli: మైత్రీ మూవీ మేకర్స్.. 'దొంగ నా కొడుకు' రిలీజ్ డేట్ ఫిక్స్!
- Husharu 2: బీరు కోసం 'క్షీరసాగర మథనం'.. కల్ట్ సీక్వెల్లో షాకింగ్ మార్పులు: ‘హుషారు 2’ పోస్టర్ వెనుక కథేంటి?
- Kandregula Naidu: మాది 3.5 రేటింగ్ సినిమా, తొక్కేయకండి.. 'అనకాపల్లి' నిర్మాత ఆవేదన!
- Indraja: ఫేక్ సక్సెస్ మీట్లకు దూరంగా ఉంటా.. ఇంద్రజ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!