Is Sandeep making Ranbir ‘godfather’?
సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రణబీర్ కపూర్ హీరోగా ‘యానిమల్’ తెరకెక్కుతున్న విషయం తెలిసినదే. ఈ సినిమా షూటింగ్ స్పాట్ నుండి ఇటీవల ఓ ఫోటో లీక్ అయింది. దీనిని బేస్ చేసుకుని సోషల్ మీడియాలో పలు కథనాలు హల్ చల్ చేస్తున్నాయి. సందీప్ హాలీవుడ్ క్లాసిక్ ‘గాడ్ ఫాదర్’ కి తన సొంత వెర్షన్ తయారు చేశాడని అంటున్నారు. అందుకు ఆ పిక్ లో హీరో మల్టీ మిలియనీర్ కొడుకుగా కనిపిస్తున్నాడు. దానికి తోడు యూనిట్ లోని వ్యక్తులుంచి అందిన సమాచారం అంటూ ఇది ‘గాడ్ ఫాదర్’ కొత్త వెర్షన్ అనేస్తున్నారు. సందీప్ రెడ్డికి ‘యానిమల్’ మూడో సినిమా. ఇప్పటి వరకూ తెలుగు ‘అర్జున్ రెడ్డి’, ఆ తర్వాత దాని హిందీ వెర్షన్ ‘కబీర్ సింగ్’ డైరెక్ట్ చేశాడు. ఇప్పుడు ‘యానిమల్’ మూడో సినిమా. మధ్యలో పలు ప్రాజెక్ట్స్ లు అనుకున్నప్పటికీ ఏదీ వర్కవుట్ అవలేదు. నిజానికి ‘గాడ్ ఫాదర్’ ఎంతో మంది ఇండియన్ డైరెక్టర్స్ ని ప్రేరేపించింది. అయితే మణిరత్నం, రామ్ గోపాల్ వర్మ మాత్రమే సక్సెస్ ఫుల్ సినిమాలుగా మలచగలిగారు. మణిరత్నం ‘నాయగన్’, ఆర్జీవీ ‘సర్కార్’ రెండూ ఘన విజయం సాధించాయి. ఇక సందీప్ ‘యానిమల్’లో రణబీర్ డాన్ కుమారుడి పాత్రలో కనిపించబోతున్నాడంటున్నారు. ఇందులో రశ్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. మరి సందీప్ ‘యానిమల్’తో మణి, ఆర్జీవి లా ‘గాడ్ ఫాదర్’ని సక్సెస్ ఫుల్ గా హ్యాండిల్ చేసి హ్యాట్రిక్ హిట్ అందుకుంటాడేమో చూడాలి.