Is Jailer Freemake of a Hollywood Movie: ఒక సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్న తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం జైలర్ అనే సినిమాలో నటిస్తున్నాడు. కళానిధి మారన్ నిర్మాణంలో సన్ పిక్చర్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. తమిళ దర్శకుల్లో అతి తక్కువ సమయంలో మంచి పేరు తెచ్చుకున్న నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్లో ఈ సినిమా ఒక బ్లాక్ కామెడీ యాక్షన్ ఫిలింగా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. రజనీకాంత్ టైటిల్ రోల్ లో నటిస్తున్న ఈ సినిమాలో ఆయనతో పాటు మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, కన్నడ సూపర్ స్టార్ శివ రాజకుమార్, జాకీష్రాఫ్, తెలుగు నుంచి సునీల్, రమ్యకృష్ణ, మలయాళం నుంచి వినాయకన్, మిర్నా వంటి వారు ఇతర కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఇక తాజాగా ఈ సినిమా నుంచి షోకేస్ అనే పేరుతో ఒక చిన్న ట్రైలర్ లాంటి వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియోను బట్టి పరిశీలిస్తే ఈ జైలర్ అనే సినిమాలో ఒక రిటైర్ అయిపోయిన వ్యక్తి కథను చూపిస్తున్నారు.
Parliament Session: స్పీకర్‌ను సభకు రమ్మనండి.. ప్రభుత్వానికి ప్రతిపక్షాల విజ్ఞప్తి
కొడుకు మనవళ్ళతో హాయిగా గడుపుతున్న సమయంలో వారికి సమస్య రావడంతో అతని బ్యాక్ గ్రౌండ్ అంతా మళ్ళీ చూపిస్తున్నట్టు చూపించారు. అయితే ఇదంతా చూస్తే మనలో చాలా మంది బాషా సినిమాకి మోడ్రన్ టచ్ ఇచ్చి మరోసారి తెరకెక్కిస్తున్నారేమో అని అనుమానాలు వ్యక్తం చేశారు. కానీ హాలీవుడ్ సినిమా నోబడీ చూసినవారు మాత్రం ఇదేంటి ఆ సినిమాకు ఫ్రీమేక్ లా ఉందే అని కామెంట్ చేస్తున్నారు. నోబడీ సినిమాలో కూడా రిటైర్ అయిపోయిన ఒక ఎఫ్బీఐ ఏజెంట్ తన కుటుంబానికి ఆపద వస్తే మళ్లీ ఎలా యాక్టివయ్యి తన కనెక్షన్స్ ఉపయోగించి కాపాడుకున్నాడు అనేది ఈ సినిమా కథగా చెబుతున్నారు. ఇక ఇప్పుడు రజనీ జైలర్ ప్రమోషనల్ వీడియో చూసిన తర్వాత కూడా అదే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మరి అది నిజమో కాదో సినిమా రిలీజ్ అయితే కానీ చెప్పలేం