Manchu Vishnu: మంచు విష్ణు హీరోగా పాయల్ రాజ్ పుత్, సన్నీ లియోన్ హీరోయిన్స్ గా నటించిన చిత్రం జిన్నా. ఇషాన్ సూర్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 5 న రిలీజ్ కానుందని మొదట ప్రకటించినా.. ఆ రోజునే చిరు, నాగ్ సినిమాలు రిలీజ్ కు సిద్ధమవుతుండగా.. పోటీ ఎందుకని జిన్నాను అక్టోబర్ 21 కి వాయిదా వేశారు. ఇక ఈ రిలీజ్ డేట్ ప్రెస్ మీట్ లో మంచు విష్ణు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశాడు. తన మీద ఇండస్ట్రీలో ఒక పెద్ద హీరో కక్ష కట్టడాన్ని, కావాలనే అతను జూబ్లీహిల్స్ లో 22 మంది ఉద్యోగులను నియమించుకొని తనను, తన కుటుంబాన్ని వేధిస్తున్నాడని పేర్కొన్నారు. అంతేకాకుండా ఆ హీరో ఓఫిక్ నుంచే వచ్చినట్లు పోలీసులు ఐపీ అడ్రెస్స్ తో సహా చెప్పారని, ఆయన పేరు చెప్తే ఇండస్ట్రీ పరువు పోతుందని చెప్పుకొచ్చాడు. దీంతో సదురు జూబ్లీహిల్స్ హీరో ఎవరు అని అభిమానులు ఆరా తీయడం మొదలుపెట్టారు. ఇక కొంతమంది అయితే జూబ్లీహిల్స్ హీరో అంటే చిరంజీవి అని, మా ఎలక్షన్స్ సమయంలో నాగబాబు కు, మంచు విష్ణు కు మధ్య మాటల యుద్ధం నడిచిందని గుర్తుచేసుకుంటున్నారు.
కాగా, తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. సదురు హీరో చిరంజీవి కాదట. అసలు ఈ గొడవకు చిరుకు సంబంధమే లేదని ఇండస్ట్రీ వర్గాల పెద్దలు చెప్పుకొస్తున్నారు. ఒక స్టార్ హీరో.. ఇలాంటి పనులు చేయిస్తాడని ఎలా అనుకున్నారని వారు అడిగినవారికి బుద్ది చెప్తున్నారట. మంచు విష్ణు చెప్పిన హీరో ఎవరు అనేది అతనికి తప్ప మరెవ్వరికీ తెలియదని, ఇండస్ట్రీ పరువు పోయే హీరో ఎవరో తనే చెప్పాలని చెప్పుకొస్తున్నారు. ఇక మెగా అభిమానులు సైతం ఇందులో నిజం లేదని ఖండిస్తున్నారు. మెగా ఫ్యామిలీ ఇంతగా ఒక హీరో ను ట్రోల్ చేయడం కోసం ఆఫీస్ పెట్టాల్సిన అవసరం లేదని, వారికి ఇలాంటి పని చేయల్సిన అవసరం లేదని చెప్పుకొస్తున్నారు. మరి మంచు విష్ణు చెప్పిన ఆ జూబ్లీహిల్స్ స్టార్ హీరో ఎవరో మా ప్రెసిడెంట్ గారే చెప్తే బావుంటుందని అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు.