‘మానాడు’ హీరో రానా కాదు… మరి ఎవరు!?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ సురేశ్ ప్రొడక్షన్స్ తమిళ చిత్రం ‘మానాడు’ తెలుగు డబ్బింగ్ తో పాటు అన్ని భాషల రీమేక్ రైట్స్ తీసుకున్న నేపథ్యంలో అందులో హీరోగా నటించేది ఎవరనే దానిపై రకరకాల పుకార్లు షికారు చేస్తున్నాయి. సురేశ్ ప్రొడక్షన్స్ అధినేత సురేశ్ బాబు ఈ సినిమాను తెలుగులో డబ్బింగ్ కాకుండా రీమేక్ చేయబోతున్నట్టు, తమ నిర్మాణ భాగస్వామిగా ఏషియన్ ఫిలిమ్స్ వ్యవహరిస్తుందని ఇప్పటికే ప్రకటించారు. అయితే.. ఈ రీమేక్ కు సంబంధించిన మిగిలిన వివరాలేవీ ఆయన ఇంతవరకూ ప్రకటించలేదు.
శింబు హీరోగా వెంకట్ ప్రభు తెరకెక్కించిన ఈ సినిమా 2021లో తమిళనాట మంచి విజయాన్ని అందుకుంది. ఈ సైంటిఫిక్ థ్రిల్లర్ మూవీలో విలన్ గా ఎస్. జె. సూర్య చక్కటి నటన కనబరిచాడు. కళ్యాణీ ప్రియదర్శన్ హీరోయిన్ గా మెప్పించింది. ఇది శింబు కు రైట్ కమ్ బ్యాక్ మూవీ అని చూసి వాళ్ళంతా కితాబిచ్చారు. అయితే దీనిని తెలుగులో రానా హీరోగా సురేశ్ బాబు తెరకెక్కించబోతున్నాడని అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ తాజా సమాచారం ప్రకారం దీనిని తన రెండో కొడుకు అభిరామ్ తో రీమేక్ చేయడానికి సురేశ్ బాబు హక్కులు తీసుకున్నాడని తెలుస్తోంది. ఇప్పటికే తేజ దర్శకత్వంలో అభిరామ్ ఓ సినిమా చేస్తున్నాడు. దాని తర్వాత అతనితోనే ‘మానాడు’ను సురేశ్ బాబు రీమేక్ చేస్తాడట. అతి త్వరలోనే దర్శకుడితో పాటు ఇతర ప్రధాన తారాగణం, సాంకేతిక నిపుణులను ఎంపిక చేసి, అధికారిక సమాచారం ఇస్తారని తెలుస్తోంది. అదే నిజమైతే… అభిరామ్ ఖాతాలో కెరీర్ ప్రారంభంలోనే ఓ డిఫరెంట్ మూవీ పడినట్టే!
Also Read
- Rajinikanth173 : సూపర్ స్టార్ 173 టైటిల్ 'ధర్మన్' ది డెడ్లీ డాక్టర్.. దర్శకుడు ఎవరంటే?
- Sardar2 : కార్తీ 'సర్దార్ -2' రిలీజ్ డేట్ ఫిక్స్.. ఈసారి యాక్షన్ డబుల్
- Allu Arjun : 'రాకా'కు స్మాల్ బ్రేక్.. లోకి సినిమా కోసం రెడీ అవుతున్న బన్నీ
- Eetha Teaser : శ్రద్ద కపూర్ మరొక సెన్సేషన్.. 'ఈట' టీజర్.. నెక్ట్స్ లెవల్
తాజావార్తలు
-
CM Revanth Reddy: SIRపై నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు.. కాంగ్రెస్ నేతలకు సీఎం కీలక సూచనలు..
-
160cc Bikes: మంచి మైలేజ్ కోసం చూస్తున్నారా?.. 160cc సెగ్మెంట్లో బెస్ట్ బైక్‌లు ఇవే..!
-
Vaibhav sooryavanshi: వైభవ్ జపం.! భారత్‌లోనే కాదు.. పాకిస్థాన్‌లోనూ బుడ్డోడి క్రేజ్ మాములుగా లేదుగా..
-
Water Bottle Cleaning: మీరు నీళ్లు తాగే బాటిల్ శుభ్రంగా ఉందా.? బ్యాక్టీరియా, దుర్వాసన రాకుండా ఇలా చేసేయండి.!
-
Pant LSG Journey: ఎఫ్ వర్డ్, విమర్శలు, అసంతృప్తి, లీడర్షిప్ రీసెట్.. ఎల్ఎస్జీలో పంత్ ప్రయాణం సాగిందిలా!
ట్రెండింగ్
-
Pesara Payasam: స్వీట్ తినాలినిపిస్తుందా.? తీపి + హెల్తీ ‘పెసరపప్పు పాయసం’ చేసేయండి ఇలా.!
-
Jharkhand Stampede: ఆర్సీబీ లాంటి మరో తొక్కిసలాట ఘటన.. అభిమానులకు తీవ్ర గాయాలు, జస్ట్ మిస్!
-
AUS W vs PAK W: పెర్రీ సూపర్ షో.. పాకిస్థాన్‌పై 113 పరుగుల భారీ విజయంతో సెమీఫైనల్ లోకి ఆసీస్.!
-
Toilet Cleaning : టాయిలెట్ క్లీనింగ్ చేస్తున్నారా..? అయితే ఈ 5 ఘోరమైన పొరపాట్లు అస్సలు చేయకండి.!
-
Cockroach Control : ఫ్రిజ్‌లో బొద్దింకల బెడదా.? ఈ సింపుల్ ట్రిక్‌తో చెక్ పెట్టండి..!