ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ సురేశ్ ప్రొడక్షన్స్ తమిళ చిత్రం ‘మానాడు’ తెలుగు డబ్బింగ్ తో పాటు అన్ని భాషల రీమేక్ రైట్స్ తీసుకున్న నేపథ్యంలో అందులో హీరోగా నటించేది ఎవరనే దానిపై రకరకాల పుకార్లు షికారు చేస్తున్నాయి. సురేశ్ ప్రొడక్షన్స్ అధినేత సురేశ్ బాబు ఈ సినిమాను తెలుగులో డబ్బింగ్ కాకుండా రీమేక్ చేయబోతున్నట్టు, తమ నిర్మాణ భాగస్వామిగా ఏషియన్ ఫిలిమ్స్ వ్యవహరిస్తుందని ఇప్పటికే ప్రకటించారు. అయితే.. ఈ రీమేక్ కు సంబంధించిన మిగిలిన వివరాలేవీ ఆయన…