Pre release: వెండితెర ‘ఐపీఎల్’కు రంగం సిద్థం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IPL: విశ్వ కార్తికేయ, నితిన్ నాష్, అవంతిక, అర్చన గౌతమ్ హీరో హీరోయిన్లుగా, సురేష్ లంకలపల్లి దర్శకత్వంలో బీరం శ్రీనివాస్ నిర్మిస్తున్న సినిమా ‘ఐపీఎల్’. ఈ సినిమా 10వ తేదీ విడుదలవుతున్న సందర్భంగా ప్రీ-రిలీజ్ వేడుకను చిత్ర యూనిట్ ప్రసాద్ ల్యాబ్స్ లో ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా కొరియోగ్రాఫర్ గణేష్ మాట్లాడుతూ, ”ఈ సినిమా టీమ్ చాలా కష్ట పడ్డారు. టీజర్, ట్రైలర్ బాగున్నాయి. వేంగి మంచి ట్యూన్స్ ఇచ్చాడు. సినిమా పెద్ద సక్సెస్ కావాలి” అని అన్నారు. నిర్మాత డి ఎస్ రావు మాట్లాడుతూ, ”నిర్మాత బీరం శ్రీనివాసరావు నాకు మంచి మిత్రుడు. ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పుడు నేను కొన్ని సూచనలు సలహాలు ఇచ్చాను. హీరో విశ్వ కార్తికేయ, హీరో నితిన్ నాష్ ఇద్దరూ జెమ్స్! ఇద్దరి స్క్రీన్ ప్రెజెన్సీ బాగుంది. వాళ్ళు పడిన కష్టం స్క్రీన్ మీద కనపడుతుంది. ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలి అని కోరుకుంటున్నాను” అని అన్నారు. ఈ చిత్ర కథానాయకుల్లో ఒకరైన విశ్వ కార్తికేయ తండ్రి రామాంజనేయులు తనకు మిత్రులని, కష్టపడి తీసిన ఈ సినిమా మంచి విజయం సాధించాలని తాను ఆకాంక్షిస్తున్నానని నిర్మాత బెక్కెం వేణు అన్నారు. తనకు నిజ జీవితంలో అన్నతమ్ముడు లేరని, అన్నీ తనకు వేంగి సుధాకరేనని, అతనే తనను ఇండస్ట్రీకి పరిచయం చేశాడని, అందుకే ఈ చిత్రంలో ఓ పాటను పాడానని రాహుల్ సిప్లిగంజ్ అన్నాడు. నిర్మాతలు చక్కని సహకారం అందించారని, పాటలు మంచి విజయం సాధించాయని వేంగి సుధాకర్ తెలిపాడు. క్రికెట్ ను, తీవ్రవాదాన్ని మిళితం చేస్తూ ‘ఐపీఎల్’ మూవీ తెరకెక్కించామని దర్శకుడు సురేశ్ లంకలపల్లి చెప్పాడు.
ఈ కార్యక్రమంలో హీరోలు విశ్వ కార్తికేయ, నితిన్ నాశ్, హీరోయిన్ అవంతికతో పాటు రచ్చ రవి, ఉదయభాస్కర్, విక్రమాదిత్య, నిర్మాత బీరం శ్రీనివాస్ తదితరులు ప్రసంగిస్తూ సినిమా విజయంపై ధీమాను వ్యక్తం చేశారు. ఈ చిత్రంలో ఇతర ప్రధాన పాత్రలను సుమన్, తనికెళ్ళ భరణి, పోసాని కృష్ణ మురళి, పృథ్వీ రాజ్, డిఎస్ రావు, అమిత్, మిర్చి మాధవి, కిన్నెర, ‘ఈ రోజుల్లో’ సాయి, రామ్ ప్రసాద్ తదితరులు పోషించారు.
Also Read
- Dude 2: ఆ క్రేజీ ఐడియా వర్కవుట్ అయితే ‘డ్యూడ్ 2’ పక్కా.. అంచనాలు పెంచేసిన డైరెక్టర్!
- Rajinikanth : ‘జైలర్ 2’తో బాకీ తీర్చేందుకు వస్తున్న రజినీకాంత్
- Dhanush - Siruthai Siva: "ఆ కథ మరెవరికీ ఇవ్వొద్దు".. ఆ తెలుగు డైరెక్టర్‌కు హీరో ధనుష్ రిక్వెస్ట్! అసలు మ్యాటర్ ఇదే..
- Anil Ravipudi: సంక్రాంతి టార్గెట్‌గా అనిల్ రావిపూడి కొత్త సినిమా.. ముహూర్తం డేట్ అఫీషియల్‌గా ప్రకటించిన డైరెక్టర్!
తాజావార్తలు
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్… సబ్బులు, బాడీ వాష్‌లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
-
OTR : బండి ఎందుకు దూరమవుతున్నారు.?
-
Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
-
SIPRI 2026: తొలిసారి అణ్వాయుధాలు మోహరించిన భారత్.. వణుకుతున్న శత్రు దేశాలు! సిప్రి షాకింగ్ నివేదిక..
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్‌కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!