Indrajalam: ‘శాసనసభ’ ఫేమ్ ఇంద్రసేన, జైక్రిష్ కీలక పాత్రలు పోషించిన సినిమా ‘ఇంద్రజాలం’. సినీ ప్రముఖుల సమక్షంలో ఈ సినిమా ప్రారంభోత్సవం రామానాయుడు స్టూడియోస్ లో ఘనంగా జరిగింది. పూర్ణాస్ మీడియా సమర్పణలో నిఖిల్ కె. బాల స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న సినిమా ఇది. బుధవారం న్యాయమూర్తి ఆర్ మాధవరావు కెమెరా స్విచాన్ తో సినిమా మొదలైంది.
Marvel Movies: రైటర్స్ గిల్డ్ సమ్మెతో ఆగిన అవతార్, మార్వెల్ మూవీస్
ఈ సందర్భంగా హీరో ఇంద్రసేన మాట్లాడుతూ, ‘శాసనసభ’ చిత్రం చూసిన నిఖిల్ తనకు ఈసినిమాలో నటించే ఛాన్స్ ఇచ్చారని అన్నారు. ఇది క్రైమ్ థిల్లర్ తో కూడిన ప్రేమకథా చిత్రమని, ఇందలోని ప్రధాన పాత్రలను సీనియర్ నటీనటులు చేయబోతున్నారని, ఇద్దరు హీరోయిన్స్ ఉంటారని దర్శక నిర్మాత తెలిపారు. జూలై మూడో వారంలో షూటింగ్ ప్రారంభించి, హైదరాబాద్, ముంబాయ్ లో రెండు షెడ్యూల్స్ తో షూటింగ్ పూర్తి చేస్తామని అంటున్నారు. కథ చాలా బావుంటుందని , హిట్ అందుకుంటుందని ఎంతో నమ్మకంగా ఉన్నామని చెప్పుకొచ్చారు. మరి ఈ సినిమాతో ఈ చిత్ర బృందం ఎలాంటి హిట్ అందుకుంటుందో చూడాలి.