టాప్ ఇండియన్ మూవీస్‌ని లిస్ట్ తీస్తే వెయ్యి కోట్ల క్లబ్ లో సౌత్ నుంచే మూడు సినిమాలున్నాయి. అమీర్ ఖాన్ ‘దంగల్’ 2000 వేల కోట్లకు పైగా వసూళ్లతో టాప్ ప్లేస్‌లో ఉంది. ఆ తర్వాత దర్శక ధీరుడు రాజమౌళి మాగ్నమ్ ఓపస్ బాహుబలి 2, 1800 కోట్లతో సెకండ్ ప్లేస్‌లో ఉంది. థర్డ్ ప్లేస్‌లోనూ జక్కన్నే ఉన్నాడు. ఆస్కార్‌తో హిస్టరీ క్రియేట్ చేసిన ట్రిపుల్ ఆర్ 1200 కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇక నాలుగో స్థానంలో ప్రశాంత్ నీల్ మాసివ్ మూవీ కెజియఫ్ చాప్టర్ 2 ఉంది. ఐదో స్థానంలో షారుఖ్ ఖాన్ ‘పఠాన్’ ఉంది. ఇప్పటివరకైతే.. ఇండియాలో వెయ్యి కోట్లు దాటిన సినిమాలు ఇవే. అయితే అప్ కమింగ్ మూవీస్‌లో ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్ కె, పుష్ప2, గేమ్ ఛేంజర్… వెయ్యి కోట్లు టార్గెట్‌గా థియేటర్స్ లోకి రాబోతున్నాయి. వీటన్నింటిని మించిన సినిమా ఒకటి రాబోతోందని అంటున్నారు కోలీవుడ్ వర్గాలు.
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ గురించి అందరికీ తెలిసిందే. ప్రజెంట్ చరణ్‌తో ‘గేమ్ ఛేంజర్’ తెరకెక్కిస్తున్నాడు, ఈ మూవీతో పాటు కమల్ హాసన్‌తో ‘ఇండియన్ 2’ కూడా చేస్తున్నాడు. ఈ సినిమానే బాహుబలి, కెజియఫ్ లకి మించి ఉంటుందని స్వయంగా కమల్ హాసన్ అంటున్నాడట. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న ఈ సినిమా ఫుటేజ్‌ని రీసెంట్‌గా చూశాడట లోక నాయకుడు. రషెష్ చూశాక కమల్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఇండియన్ 2 ముందు బాహుబలి, కేజీఎఫ్ 2 సినిమాలు నత్తింగ్ అంటూ తేల్చి చెప్పేశారట కమల్. ఈ సినిమా అవుట్ పుట్ ఆ లెవల్లో ఉంటుందని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. అయితే అక్కడుంది శంకర్ కాబట్టి.. ఎలాంటి మ్యాజిక్ అయినా జరగుతుంది అని నమ్మడంలో తప్పులేదు కానీ అది ఒకప్పటి శంకర్ విషయంలో జరిగేది. ప్రస్తుతం శంకర్ ట్రాక్ రికార్డ్ బాగాలేదు, హిట్ కొట్టి చాలా కాలమే అయ్యింది. శంకర్ అవుట్ ఫామ్ లో ఉన్నాడు కాబట్టి ఇండియన్ 2 గురించి ఇప్పుడే ఏం చెప్పలేం.