Allu Arjun: టార్గెట్ ఫిక్స్… ఈసారి బౌండరీలు దాటబోతున్నారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప ది రైజ్ సినిమాతో ఐకాన్ స్టార్ అయ్యాడు. పాన్ ఇండియా మార్కెట్ ని సొంతం చేసుకున్న పుష్పరాజ్, తన రూలింగ్ తో మరోసారి సెన్సేషన్ క్రియేట్ చెయ్యడానికి రెడీ అవుతున్నాడు. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ పుష్ప ది రూల్ సినిమాని పార్ట్ 1 కన్నా గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నాడు. ఈ డిసెంబర్ లో కానీ 2024 సమ్మర్ లో కానీ పుష్ప 2 సినిమాని ఆడియన్స్ ముందుకి తీసుకొని రావడానికి మేకర్స్ రెడీ అవుతున్నారు. షూటింగ్ కంప్లీట్ అయ్యాక పుష్ప 2 రిలీజ్ డేట్ విషయంలో ఒక క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. ఈ మూవీ అయిపోయిన తర్వాత అల్లు అర్జున్ సందీప్ రెడ్డి వంగతో ఒక సినిమా అనౌన్స్ చేసాడు, కొరటాల శివతో కూడా ఒక సినిమా చెయ్యడానికి ఓకే చెప్పాడు. ఈ రెండు ప్రాజెక్ట్స్ అఫీషియల్ గా అనౌన్స్ అయినవే. కొరటాల శివ-అల్లు అర్జున్ సినిమా ఎన్టీఆర్ ‘దేవర’ రిజల్ట్ పైన డిపెండ్ అయ్యి ఉంది. సందీప్ రెడ్డి వంగ ప్రాజెక్ట్ స్పిరిట్ అయిపోయాకే ఉండబోతుంది. అప్పటివరకూ అల్లు అర్జున్ సైలెంట్ గా ఉండడమనేది కష్టమైన పనే.
ఇలాంటి సమయంలో సుకుమార్ ఇచ్చిన ఇంపాక్ట్ ని కంటిన్యు చేయాలి అంటే సుకుమార్ స్థాయి దర్శకుడితో అల్లు అర్జున్ సినిమా చెయ్యాల్సిందే. ఈ లెక్క పర్ఫెక్ట్ గా తెలుసు కాబట్టే అల్లు అర్జున్, త్రివిక్రమ్ తో ప్రాజెక్ట్ రెడీ చేస్తున్నాడు. ఈ ఇద్దరి కాంబినేషన్ లో ఇప్పటికే మూడో సినిమా వచ్చాయి. మూడు సినిమాలు సూపర్ హిట్స్ ఇచ్చి హ్యాట్రిక్ కాంబినేషన్ గా పేరు తెచ్చుకున్న అల్లు అర్జున్-త్రివిక్రమ్ లు అల వైకుంఠపురములో సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టారు. ఇప్పటివరకు అల్లు అర్జున్-త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు రీజనల్ మార్కెట్ ని మాత్రమే పరిమితం అయ్యాయి. ఈసారి మాత్రం రీజనల్ సినిమా నుంచి పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చెయ్యడానికి బన్నీ-త్రివిక్రమ్ రెడీ అవుతున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ కాంబోలో పాన్ ఇండియా సినిమా రాబోతుంది. పుష్ప 2 అయిపోగానే స్టార్ట్ అవ్వనున్న ఈ సినిమా అఫీషియల్ అనౌన్స్మెంట్ త్వరలోనే బయటకి రానుంది.
Also Read
- 'Varanasi' Surprise: మహేష్ బాబు బర్త్ డే రోజు 'వారణాసి' మేకర్స్ సర్ప్రైజ్ అనౌన్స్మెంట్! చూశారా?
- Jason Sanjay: ఇప్పటికీ నన్ను చిన్న పిల్లాడిలాగే చూస్తుంది.. అమ్మ సంగీత గురించి జాసన్ సంజయ్ ఏం చెప్పారంటే!
- Jason Sanjay: "ఫస్ట్ గ్రీన్ సిగ్నల్ నాన్నదే" డైరెక్టర్ జాసన్ సంజయ్.. దళపతి విజయ్ సపోర్ట్ గురించి వారసుడు ఏమన్నాడంటే?
- TFTDDA: తెలుగు ఫిలిం డాన్సర్స్ అసోసియేషన్ ఉప ఎన్నికల ఫలితాలు వెల్లడి
తాజావార్తలు
-
Hash Oil : స్నాప్‌చాట్‌లో డ్రగ్స్ దందా.. ORR వద్ద పెడ్లర్ అరెస్ట్.!
-
VVS Laxman: వీవీఎస్ లక్ష్మణ్ ‘నో’ చెప్పడం వల్లే గంభీర్‌కు ఊహించని అవకాశం.. ఎవరికీ తెలియని సీక్రెట్ రివీల్..
-
CM Chandrababu: ‘ప్రియాంక మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు’.. బాధిత కుటుంబానికి రూ. 20 లక్షల ఆర్థిక సాయం..
-
New Phones: గూగుల్ నుంచి కొత్త ఫోన్స్.. పిక్సెల్ 11, 11 ప్రో, 11 ప్రో XL , 11 ప్రో ఫోల్డ్.. ఫీచర్స్ అదరహో..
-
Bhatti Vikramarka : యూసీ బర్క్లీలో భట్టి విక్రమార్క.. తెలంగాణ క్లీన్ ఎనర్జీపై బిగ్ ప్లాన్.!
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!