సందడే సందడి… ఇది పుష్పరాజ్ సందడి. ఎక్కడ చూసినా ఇప్పుడు అల్లు అర్జున్ మాత్రమే కనిపిస్తున్నాడు. ఇటీవల “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్” సక్సెస్ మీట్‌కి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హాజరయ్యాడు. ఇప్పుడు “వరుడు కావలెను” ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో ముఖ్య అతిథిగా పాల్గొని యంగ్ హీరో నాగశౌర్యకు తనవంతు సాయంగా సినిమాపై బజ్ ను క్రియేట్ చేయబోతున్నాడు. ఇలా ప్రస్తుతం బన్నీ చాలా సినిమాలకు అథితిగా హాజరు కాబోతున్నాడు. బన్నీ “వరుడు కావలెను” ఈవెంట్‌కి హాజరవ్వడానికి ముఖ్య కారణం ఏమిటంటే, ఈ చిత్రాన్ని అల్లు అర్జున్ హీరోగా నటించిన “అల వైకుంఠపురంలో” మేకర్స్ నిర్మించారు. అయితే అల్లు అర్జున్ ఇప్పుడు ఇలాంటి వివిధ కార్యక్రమాలకు హాజరు కావడం ద్వారా తన ఇమేజ్‌ను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాలని భావిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. తన సొంత సినిమాపై దృష్టి పెట్టడం కంటే ఆయన ఇతర సినిమాలను కూడా ప్రమోట్ చేస్తున్నాడు. మీడియా ముందు అల్లు అర్జున్ ఇలా కన్పించడం అంటే పరోక్షంగా ‘పుష్ప’ ప్రమోషన్లు కూడా జరుగుతున్నట్టే. అయితే కరోనా కారణంగా డీలా పడిన థియేటర్లు ఇప్పుడిప్పుడే మంచి ప్రజాదరణ పొందుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆలు అర్జున్ వంటి స్టార్ హీరోలు సినిమాలకు ప్రమోషన్ కార్యక్రమాలు చేపడితే ఎక్కువ మంది ప్రేక్షకులు థియేటర్‌లకు వెళ్లడానికి అవకాశం ఉంటుంది.
Read Also : మెగా అప్డేట్ : “భోళా శంకర్” ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారు
ఇక ఈ నెల 28న “పుష్ప” నుంచి మూడవ పాట “సామీ నా సామీ” సాంగ్ విడుదల కానుంది. మరోవైపు విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ నటిస్తున్న “పుష్పక విమానం” సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ లో పాల్గొననున్నాడు. ఈ వేడుక అక్టోబర్ 30న జరగనుంది. మొత్తానికి సినిమాతో సంబంధం లేకుండానే అల్లు అర్జున్ ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తున్నాడు. కాగా అల్లు అర్జున్ “పుష్ప” 2021 డిసెంబర్ 17న థియేటర్లలోకి రాబోతోంది.