స్టార్ హీరోయిన్స్ ఒకరైన సమంత గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. కెరీర్ మంచి పీక్స్ లో ఉండగానే తన జీవితం అనుకోని మలుపు తిరిగింది. భర్తతో విడిపోయి ఒంటరిగా గడుపుతున్న క్రమంలో, మయోసైటిసిస్ అనే వ్యాధి బారిన పడింది సమంత. ఈ నేపథ్యంలో కొంతకాలం పాటు సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉండి ఆరోగ్యం కోసం ఎంతగానో పోరాడింది. ఇక ఇప్పుడిప్పుడే తిరిగి సాధారణ స్థితికి రావడం తో సినిమాలపై పూర్తిస్థాయిలో ఫోకస్ పెట్టింది సమంత. కానీ సినిమాల కంటే ఎక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ రోజు వార్తల్లో నిలుస్తోంది. తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని షేర్ చేసుకుంటుంది. అయితే ఇటీవల సమంత ప్రేమలో పడ్డారు అంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో.. తాజాగా దీనిపై స్పందించింది సామ్.
Also Read: Singer Kalpana: కల్పన తాజా హెల్త్ అప్‌డేట్ ఇదే.. డాక్టర్లు ఏం చెప్పారంటే..!
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో భాగంగా సమంత మాట్లాడుతూ ‘ జీవితంలో మళ్లీ ప్రేమలో పడాలని ఎప్పుడూ కూడా ఆలోచించలేదు. వాటిపై ఇంకా చర్చించాలని కూడా లేదు. అది నా పూర్తి వ్యక్తిగతమైన విషయం. దాన్ని అలాగే వ్యక్తిగతంగానే ఉంచుతాను’ అంటూ చెప్పుకొచ్చింది. అంటే సమంత మాటలను బట్టి చూస్తే వచ్చిన రూమర్స్ లో ఎలాంటి నిజం లేదు అని, సమంతకి మలి ప్రేమలో పడే ఉద్దేశం కూడా లేదని అర్ధమవుతుంది. కానీ సమంత మాటకు, ఆమె అభిమానులు ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు. ‘ఇలా ఒంటరిగా ఉండటం వల్ల లాభం లేదు మీకూడా ఒక లైఫ్ ఉంది’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.