Arjun Das: ‘బుట్టబొమ్మ’ కొత్త అనుభూతినిస్తుంది!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Butta Bomma: ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ , ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ తో కలిసి నిర్మిస్తున్న ఫీల్ గుడ్ రూరల్ డ్రామా ‘బుట్ట బొమ్మ’. సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మాతలు. అనిక సురేంద్రన్, సూర్య వశిష్ఠ, అర్జున్ దాస్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంతో శౌరి చంద్రశేఖర్ రమేష్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. జనవరి 26న భారీస్థాయిలో థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా నటుడు అర్జున్ దాస్ విలేకర్ల సమావేశంలో పాల్గొని ఈ చిత్రానికి సంబంధించిన విశేషాలను పంచుకున్నారు.
తన సినీ ప్రయాణం గురించి తొలుత అర్జున్ దాస్ వివరిస్తూ, ” ‘పెరుమాళ్’ తర్వాత చాలాకాలం మంచి అవకాశాల కోసం ఎదురుచూశాను. ”ఖైదీ, అంధఘారం, మాస్టర్” సినిమాల నుంచి కెరీర్ ఊపందుకుంది. ముఖ్యంగా లోకేష్ కనగరాజ్ గారి సినిమాలలో భాగం కావడం సంతోషంగా అనిపించింది. ఆయన వల్లే ఇంత గుర్తింపు వచ్చింది. సితార ఎంటర్ టైన్ మెంట్స్ వంటి ప్రముఖ నిర్మాణ సంస్థలో ‘బుట్ట బొమ్మ’ సినిమా చేసే అవకాశం రావడం చాలా ఆనందంగా ఉంది” అని అన్నారు. ఈ సినిమా కోసం తనని సంప్రదించిన రోజుల్ని గుర్తు చేసుకుంటూ, ”ఒకసారి నిర్మాత వంశీ గారు ఫోన్ చేసి మూవీ గురించి చెప్పారు. ఆయన నా మీద ఎంతో నమ్మకం ఉంచి, ఈ సినిమా ఖచ్చితంగా మీరే చేయాలని అన్నారు. మరుసటి రోజు దర్శకుడు రమేష్ చెన్నై వచ్చి నన్ను కలిసి కథ, పాత్ర గురించి వివరించారు. ఆ తర్వాత నేను హైదరాబాద్ వచ్చి వంశీ గారిని కలిసి ఈ సినిమాలో భాగం కావడం జరిగింది. అప్పటివరకు నేను వంశీ గారిని కలవలేదు. ఆ రోజే ఆయనను మొదటిసారి కలిశాను. పిలిచి మరీ నాకు ఈ అవకాశం ఇచ్చారు” అని అన్నారు.
Also Read
- Sankranti 2027: అనిల్ రావిపూడికి ఈసారి టఫ్ ఫైట్.. 2027 సంక్రాంతి బరిలో బిగ్ వార్!
- Toxic Makers: ‘ధురంధర్ 2’కు షాకిచ్చిన ‘టాక్సిక్’.. ఫ్యాన్స్‌కు మేకర్స్ కీలక విజ్ఞప్తి
- Shiraz Mehdi: దిల్ రాజు సహా ఫిల్మ్ ఛాంబర్‌కు దర్శకుడు లీగల్ నోటీసులు, సీఎం రేవంత్ కు ఫిర్యాదు!
- NBK111: స్పీడ్ పెంచిన బాలయ్య .. శుక్రవారం డబ్బింగ్, అక్టోబర్ 5న కొత్త షెడ్యూల్!
‘బుట్టబొమ్మ’ చిత్రం మలయాళ చిత్రం ‘కప్పెల’కు రీమేక్. ఆ విషయం గురించి అర్జున్ దాస్ మాట్లాడుతూ, ”దీని మలయాళ వర్షన్ ఓటీటీలో ఉన్న మాట వాస్తవమే. ఇదే ప్రశ్న నేను నాగవంశీ గారి తోనూ చర్చించాను. అయితే ఈ మూవీ తెలుగు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుందని ఆయన నమ్మారు. అలాగే తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా కొన్ని మార్పులు చేయడం జరిగింది. సినిమా ఖచ్చితంగా అందరిని అలరిస్తుంది. ఇందులో నేను ఆర్.కె. అనే పాత్ర చేశాను. ఇక త్వరలో విడుదల కాబోతున్న నేపథ్యంలో ఈ పాత్ర గుణగణాల గురించి అంతకంటే ఎక్కువ చెప్పలేను” అని అన్నారు. తెలుగు సినిమాలో నటించిన అనుభూతిని వివరిస్తూ, ”తెలుగు ప్రేక్షకుల నుంచి నాకు లభిస్తున్న ఆదరణ అసలు ఊహించలేదు. ఒకసారి హైదరాబాద్ లో ఓ మాల్ కి వెళ్ళినప్పుడు చాలామంది నన్ను గుర్తుపట్టి నాతో ఫోటోలు దిగడానికి రావడం చూసి ఆశ్చర్యపోయాను. షూటింగ్ కోసం వైజాగ్ వెళ్ళినప్పుడు అక్కడ లభించిన స్వాగతం అసలు మరచిపోలేను. కొందరికి నా పేరు గుర్తు లేకపోయినా సినిమాల్లో పోషించిన పాత్రల పేరుతో పిలుస్తూ మాట్లాడిస్తున్నారు. నేను తెలుగు ప్రేక్షకులకు ఇంతలా దగ్గర అయ్యాయని ఇక్కడికి వచ్చాకే తెలిసింది. నేను ఎన్నో తెలుగు సినిమాలు చూశాను. కానీ తెలుగు సినిమాల్లో నటించే అవకాశం వస్తుందని ఊహించలేదు. నాకు తెలుగు సినిమాలో నటించే అవకాశం రావడం, డబ్బింగ్ సినిమాలతో నేను తెలుగు ప్రేక్షకులకు ఇంతలా చేరువయ్యాయని తెలియడం చాలా సంతోషంగా ఉంది” అని అన్నారు. ‘బుట్టబొమ్మ’లోని తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకున్నానని చెబుతూ, ”చాలామంది నా వాయిస్ గురించి మాట్లాడుతుంటారు. చాలా బాగుందనీ అంటారు. అందుకే ‘బుట్టబొమ్మ’ కోసం మొదటిసారి తెలుగులో డబ్బింగ్ చెప్పాను. నేను ఈ సినిమా ఒప్పుకునే ముందే నిర్మాత వంశీ గారు సొంతంగా డబ్బింగ్ చెప్పాలని షరతు పెట్టారు. దాంతో నా కోరిక కూడా తీరిపోయింది” అని అన్నారు.
తాజావార్తలు
-
Nepal Floods: నేపాల్ వరదలపై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. సీఎం రేవంత్ ఆదేశాలతో ప్రత్యేక హెల్ప్‌లైన్ ఏర్పాటు
-
Off The Record: తగ్గేదిలేదు.. స్థానిక సమరంలో జనసేన సరికొత్త వ్యూహం..!
-
Story Board : ‘లవ్ జిహాద్’ కోణంపై పోలీసుల ఫోకస్
-
Iran-Oman: హార్ముజ్ ఆదాయంపై ఇరాన్-ఒమన్ కీలక ఒప్పందం.. అమెరికాకు షాక్
-
Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్‌గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..