టాలీవుడ్‌లో ఎనర్జిటిక్ హీరోగా తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకున్నాడు సందీప్ కిషన్. ‘స్నేహగీతం’ సినిమాతో మొదలైన సందీప్ కెరీర్, అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూసుకోలేదు. ‘ప్రస్థానం’ మూవీ లో తను చేసిన నెగిటివ్ రోల్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆ సినిమాలో తన నటనకు ప్రేక్షకుల నుంచి కాకుండా, సినీ విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు దక్కాయి. ఇక ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ లాంటి హిట్‌తో హీరోగా సత్తా చాటాడు. కానీ తర్వాత సరైన స్క్రిప్ట్ తన దగ్గరికి రాకపోవడంతో హీరోగా కొంచెం వెనకబడ్డాడు. కానీ తెలిసో తెలియకో చేతి వరకు వచ్చిన రెండు హిట్ సినిమాలను వదులుకున్నాడట సందీప్.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సందీప్ ఓ ఆసక్తికరమైన విషయం పంచుకున్నాడు. తనకు చేజారిపోయిన రెండు బ్లాక్‌బస్టర్ సినిమాల గురించి వెల్లడించాడు. ‘దర్శకుడు త్రినాథరావు, నక్కిన దర్శకత్వంలో వచ్చిన ‘నేను లోకల్’, ‘హలో గురు ప్రేమ కోసమే’ చిత్రాల్లో మొదట హీరోగా ననే అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల ఆ రెండు సినిమాల్లో నటించే ఛాన్స్ మిస్ అయింది. ఆ సినిమాలు వేరే హీరోల దగ్గరికి వెళ్లి బ్లాక్‌బస్టర్ హిట్స్ అయ్యాయి. ఒకవేళ ఆ సినిమాలు నా ఖాతాలో ఉండి ఉంటే నా కెరీర్ ఇంకో లెవెల్‌కి వెళ్లేది. అయినా, ఇప్పుడు వస్తున్న అవకాశాల పట్ల కూడా చాలా సంతోషంగా ఉన్నాను’ అని తెలిపాడు సందీప్.
అయితే ఇలాంటి సంఘటనలు ప్రతి ఒక హీరో అండ్ హీరోయిన్ లు ఎదుర్కొంటున్నారు. వారి వరకు వచ్చిన మంచి మంచి సినిమాలు టైమ్ లేకనో లేదా వేరే ఇతర కారణాల చేత నో వదులుకుంటారు. తర్వాత వాలు వదులుకున్న సినిమాలు సూపర్ హిట్ అవడంతో బాధపడుతూ ఉన్నారు. ఇప్పుడు సందీప్ విషయం లో కూడా అలాంటిదే జరిగింది.